న్యూఢిల్లీ: కోల్ ఇండియా నికర లాభం (కన్సాలిడేటెడ్)గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి స్వల్పంగానే వృద్ధి చెందింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2014-15) నాలుగో త్రైమాసిక కాలానికి రూ.4,239 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికి కాలానికి రూ.4,248 కోట్లకు పెరిగిందని కోల్ ఇండియా తెలిపింది. మొత్తం ఆదాయం రూ.21,340 కోట్ల నుంచి రూ.21,403 కోట్లకు ఎగసింది. ఉత్పత్తి 152 మిలియన్ టన్నుల నుంచి 165 మిలియన్ టన్నులకు పెరిగింది. స్టాండోలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ.9,629 కోట్ల నుంచి 45 శాతం పెరిగింది.
వృద్ధితో రూ.13,950 కోట్లకు ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం(కన్సాలిడేటెడ్) 4 శాతం వృద్ధితో రూ.14,274 కోట్లకు, ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.రూ.78,010 కోట్లకు పెరిగాయని కోల్ ఇండియా తెలిపింది.
కోల్ ఇండియా లాభం రూ.4,248 కోట్లు
Published Mon, May 30 2016 3:53 AM | Last Updated on Mon, Sep 4 2017 1:12 AM
Advertisement