20 వేల పోస్టాఫీసుల్లో కోర్ బ్యాంకింగ్
న్యూఢిల్లీ: దాదాపు 20,106 పోస్టాఫీసు శాఖలకు కోర్ బ్యాంకింగ్ సదుపాయాన్ని విస్తరించినట్లు టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. 2014 మేలో వీటి సంఖ్య 230 మాత్రమేనని సోషల్ నెట్‌వర్కింగ్ సైటు ట్వీటర్‌లో పేర్కొన్నారు. కోర్ బ్యాంకింగ్ సదుపాయాలతో పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాలు ఉన్నవారు తమ లావాదేవీలను మరింత మెరుగ్గా నిర్వహించుకోవచ్చని మంత్రి తెలిపారు. చెల్లింపుల బ్యాంకు ఏర్పాటు కోసం పోస్టల్ విభాగానికి 2015 సెప్టెంబర్ 7న రిజర్వ్ బ్యాంక్ సూత్రప్రాయంగా అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే.