సాక్షి, ముంబై: కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తన సర్వీసులను నిలిపివేసింది. ‘వినియోగదారుల అవసరాలను తీర్చడమే ప్రథమ ప్రాధాన్యత, సాధ్యమైనంత త్వరలో మళ్లీ మీ ముందుకు వస్తామని హామీ ఇస్తున్నాం’ అని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ప్రస్తుతం కష్ట కాలంలో ఉన్నాం. అందరూ సురక్షితంగా ఉందాం. తద్వారా జాతికి సాయ పడదాం. ఇంట్లోనే ఉంటూ మనల్ని మనల్ని కాపాడుకుందాం’ అంటూ ఒక ప్రకటన జారీ చేసింది. కాగా కరోనా వైరస్ ప్రకంపనలు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. బుధవారం నాటికి 4,22,566 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 18,887 మరణాలు చోటు చేసుకున్నాయి.
చదవండి : తమిళనాడులో తొలి కరోనా మరణం
అమెరికాలో కరోనా విస్ఫోటనం!
Comments
Please login to add a commentAdd a comment