సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ, హైదరాబాద్‌లో కరోనా కేసులు వెలుగుచూడటంతో ఆర్థిక వ్యవస్ధపై దీని ప్రభావం గురించి ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా ఎఫెక్ట్‌తో మార్చి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 0.20 శాతం మేరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక మందగమనంతో ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ కుదేలవగా కరోనా వైరస్ మరింత నష్టం వాటిల్లనుంది. భారత్‌లో ఎలక్ర్టానిక్స్, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్ వంటి రంగాలు కరోనా వైరస్‌తో దెబ్బతింటాయని, ఫలితంగా ఆర్థిక వృద్ధి మందగిస్తుందని యూబీఎస్ సెక్యూరిటీస్ నివేదిక స్పష్టం చేసింది. 2020 మార్చి క్వార్టర్‌లో జీడీపీ వృద్ధి రేటు 0.20 శాతం తగ్గవచ్చని తాము అంచనా వేస్తున్నామని ఈ నివేదిక వెల్లడించింది. ఇక 2020-21లో భారత ఎకానమీ 5.6 శాతమే వృద్ధి సాధిస్తుందని, మరుసటి ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు కోలుకోవచ్చని యూబీఎస్ నివేదిక అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment