న్యూఢిల్లీ : దేశంలోని బ్యాంక్‌లపై వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఆర్బీఐ నిర్వహిస్తున్న బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కు బ్యాంకింగ్ సేవలపై ఈ ఏడాది వచ్చిన ఫిర్యాదులను బట్టి ఈ విషయం అర్థమవుతోంది. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ... గతేడాదితో పోలిస్తే 2017-2018లో ఫిర్యాదుల్లో 25 శాతం పెరుగుదల ఉండవచ్చని ఆర్బీఐ అధికారులు అంచనా వేస్తున్నారు. గత నాలుగేళ్లలో గుజరాత్ నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 93 శాతం పెరుగుదల నమోదైంది. 2014-2015లో 4,965 ఫిర్యాదులు రాగా, 2017-2018లో ఆ సంఖ్య 9,600కు చేరింది. కానీ దేశవ్యాప్తంగా చూసినప్పుడు ఈ నాలుగేళ్లలో పెరుగుదల కేవలం 7 శాతంగా ఉంది.
వీటిలో ఏటీఎం కార్డుల సమస్యలపైనే ఎక్కువ మంది వినియోగదారులు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయిస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా బ్యాంకులు విధిస్తున్న చార్జీలపై వస్తున్న ఫిర్యాదులు ఆ తర్వాతి స్థానంలో నిలిచాయి. అందులో ముఖ్యంగా మొబైల్, ఇంటర్నెట్ బ్యాకింగ్ వినియోగించేవారిపై చార్జీల బాదుడు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment