ఈ ఏడాది 50 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ చదువులకు డిమాండ్ బాగుంది. దేశంలో ఈ ఏడాది ఆన్‌లైన్ లెర్నింగ్ 50 శాతంమేర పెరిగింది. ఇందులో టెక్నాలజీ, ఇంగ్లిష్ కోర్సులు ముందంజలో ఉన్నాయి. ఆన్‌లైన్ కోర్సులు అందించే ప్రముఖ ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ ‘కోర్స్‌రా’ ఈ విషయాలను వెల్లడించింది. టాప్–10 పాపులర్ కోర్సులలో టెక్నాలజీకి చెందినవి 70 శాతం వాటాను, ఇంగ్లిష్‌కి సంబంధించినవి 30 శాతం వాటాను ఆక్రమించాయని పేర్కొంది. కాగా ‘కోర్స్‌రా’కు దేశవ్యాప్తంగా 18 లక్షల మంది, అంతర్జాతీయంగా 2.3 కోట్ల మంది రిజిస్టర్ యూజర్లు (లెర్నర్లు) ఉన్నారు. దీంతో అమెరికా తర్వాత భారత్‌లోనే సంస్థకి ఆన్‌లైన్ లెర్నర్స్ సంఖ్య ఎక్కువగా ఉంది. భారత్‌లో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో రిజిస్టర్ యూజర్ల సంఖ్య దాదాపు 50 శాతంమేర పెరిగిందని సంస్థ పేర్కొంది.
ఆన్‌లైన్ విద్యకు డిమాండ్
Published Wed, Dec 28 2016 1:09 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement