
న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 91 శాతం క్షీణించింది. గత క్యూ2లో రూ.199 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.18 కోట్లకు తగ్గిందని డీఎల్‌ఎఫ్ వివరించింది. మొత్తం ఆదాయం రూ.2,226 కోట్ల నుంచి 21 శాతం తగ్గి రూ.1,751 కోట్లకు చేరిందని పేర్కొంది.
ఇక ఆరు నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి రూ.460కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.128 కోట్లకు తగ్గిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.4,251 కోట్ల నుంచి రూ.3,963 కోట్లకు చేరిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో డీఎల్‌ఎఫ్ షేర్ 1.9 శాతం నష్టపోయి రూ. 208 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment