
వాషింగ్టన్ : అల్యూమినియం, ఉక్కు దిగుమతులపై 25%, 10% చొప్పున సుంకాలను ప్రకటించి, ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేసిన డొనాల్డ్ ట్రంప్, అక్కడితో ఆగేలా కనిపించడం లేదు. దాదాపు 4 లక్షల కోట్ల చైనా ఉత్పత్తులపై కూడా భారీగా పన్ను పోటు విధించేందుకు సిద్ధమవుతున్నారు. టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్ రంగాలను టార్గెట్‌గా చేసుకుని, 60 బిలియన్ డాలర్ల చైనా దిగుమతులపై టారిఫ్‌లు విధించాలని ట్రంప్ ప్లాన్ చేస్తున్నట్టు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన సంబంధిత వ్యక్తులు చెప్పారు. అమెరికా ట్రేడ్ యాక్ట్ 1974 కింద మేథో సంపత్తి విచారణ సెక్షన్ 301తో ఈ టారిఫ్‌లు అసోసియేట్ అవుతాయని మరో సంబంధిత వ్యక్తి తెలిపారు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, టెలికాం రంగాలను టార్గెట్‌గా చేసుకుని, ఈ టారిఫ్‌లను విధించబోతున్నారని పేర్కొన్నారు.
అయితే ఈ విషయంపై స్పందించడానికి వైట్‌హౌజ్ నిరాకరించింది. సినో-యూఎస్ వాణిజ్య సంబంధాలు జీరో-సమ్ గేమ్ లాంటివి కావని, ఆందోళనలను సమర్థవంతంగా నిర్వహించడానికి నిర్మాణాత్మక మార్గాలను రెండు దేశాలు అనుకరించాలని చైనీస్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లూ కాంగ్ తెలిపారు. చైనా ప్రయోజనాలకు హాని కలిగేలా అమెరికా చర్యలు తీసుకుంటే, చైనా కూడా తమ చట్టబద్ధమైన హక్కులను సమర్థవంతంగా పరిరక్షించుకుంటుందన్నారు. చైనాను శిక్షించడానికి తన పెట్టుబడుల పాలసీలతో ట్రంప్ చైనీస్ హై టెక్నాలజీ కంపెనీలను ఎక్కువగా టార్గెట్ చేసినట్టు తెలిసింది. జాతీయ భద్రతా ఆంక్షల కింద చైనీస్ కంపెనీలపై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పెట్టుబడుల నిబంధనలను విధించాలని కూడా చూస్తోంది. అయితే వీటి వివరాలు ఇంకా తెలియరాలేదు. అమెరికా ట్రెజరీ అధికార ప్రతినిధి కూడా వెంటనే స్పందించలేదు.
ట్రంప్ టారిఫ్ ప్లాన్‌లో కార్మికులతో ముడిపడి ఉన్న కన్జ్యూమర్ రంగం ఉంది. దీనిపై వాషింగ్టన్ లాబియిస్ట్‌లు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ట్రంప్ విధించబోతున్న ఎక్కువ టారిఫ్‌లు, అమెరికా కుటుంబాలను మాత్రమే దెబ్బతీస్తాయని రిటైల్ ఇండస్ట్రి లీడర్స్ అసోసియేషన్ ట్రేడ్ లాబియిస్ట్ హన్ క్వాచ్ చెప్పారు. కేవలం ఫ్యాన్సీ స్వెటర్ల గురించే తాము మాట్లాడటం లేదని, టీ-షర్ట్‌లు, జీన్స్, షూలు, స్కూలకు వేసుకెళ్లే పిల్లల వస్త్రాలు అన్నింటి గురించి తాము మాట్లాడుతున్నామని చెప్పారు. గత వారం స్టీల్, అల్యూమినియంపై టారిఫ్‌లు విధిస్తున్నట్టు ప్రకటించిన ట్రంప్, చైనాను ప్రత్యక్షంగానే టార్గెట్ చేస్తున్నట్టు సంకేతాలు ఇచ్చారు. బీజింగ్ నుంచి కూడా దీనిపై గట్టి స్పందనే వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment