న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రభుత్వ రంగ సంస్థలైన ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ (ఈఈఎస్‌ఎల్), బీఎస్‌ఎన్‌ఎల్ చేతులు కలిపాయి. దశల వారీగా దేశవ్యాప్తంగా 1,000 బీఎస్‌ఎన్‌ఎల్ సైట్లలో చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పేందుకు అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం చార్జింగ్ సర్వీసులకు అవసరమైన ఇన్‌ఫ్రా ఏర్పాటు, నిర్వహణ మొదలైన వాటికి కావాల్సిన నిధులను ఈఈఎస్‌ఎల్ ఇన్వెస్ట్ చేయనుంది. స్థలం, విద్యుత్ కనెక్షన్లను.. బీఎస్‌ఎన్‌ఎల్ సమకూరుస్తుంది. జాతీయ విద్యుత్ వాహన పథకంలో భాగంగా ఈఈఎస్‌ఎల్ ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 300 ఏసీ, 170 డీసీ చార్జర్లను ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment