ఈక్విటీ సిప్ కు సరైన సమయమేది? | Equity is the time to sip? | Sakshi
Sakshi News home page

ఈక్విటీ సిప్ కు సరైన సమయమేది?

Published Mon, Jan 25 2016 1:00 AM | Last Updated on Sun, Sep 3 2017 4:15 PM

ఈక్విటీ సిప్ కు సరైన సమయమేది?

ఈక్విటీ సిప్ కు సరైన సమయమేది?

ఐసీఐసీఐ ప్రు ఇలైట్ వెల్త్ టూ-మాక్సిమైజర్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయమని మిత్రుడొకరు సలహా ఇస్తున్నారు. ఏడాదికి రూ.5 లక్షల చొప్పున ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది సరైన ఇన్వెస్ట్‌మెంట్ విధానమేనా ? లేకుంటే మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్)లో ఇన్వెస్ట్ చేయమంటారా ?  తగిన సలహా ఇవ్వగలరు.  - ప్రకాశ్ , విశాఖపట్టణం

ఐసీఐసీఐ ప్రు ఇలైట్ లైఫ్ టూ అనేది యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్  పాలసీ.  బీమాను, పెట్టుబడులను కలగలిపిన పాలసీ ఇది,  ఈ తరహా పాలసీల్లో వ్యయాలు అధికంగా ఉంటాయి. కాబట్టి  మదుపు చేయడానికి  ఈ తరహా పాలసీలు సరైనవి కావు. ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఎప్పుడు బీమా పాలసీల్లో ఇన్వెస్ట్ చేయకూడదు. జీవిత బీమా అవసరాల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. ఇక మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. మీ ఆర్థిక లక్ష్యాలు, మీరు భరించగలిగే రిస్క్‌ను బట్టి మీ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉండాలి.

మ్యూచువల్ ఫండ్స్‌లో ఎంత కాలం ఇన్వెస్ట్ చేస్తే పన్ను మినహాయింపులు పొందవచ్చు?  - సౌజన్య, వరంగల్
ఈక్విటీ, డెట్ ఫండ్స్‌కు పన్ను నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను ఇన్వెస్ట్ చేసిన ఏడాదిలోపే విక్రయిస్తే, వీటిపై వచ్చిన లాభాలను స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది తర్వాత వీటిని విక్రయిస్తే వచ్చే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు.

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను ఏమీ చెల్లించాల్సిన పనిలేదు. ఇక డెట్ ఫండ్స్ విషయానికొస్తే, మూడేళ్లలోపు వీటిని విక్రయిస్తే, వీటిపై వచ్చిన లాభాలను స్వల్పకాలిక మూలధన లాభాల పన్నుగా పరిగణించి మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. డెట్ ఫండ్స్‌ను మూడేళ్ల తర్వాత విక్రయిస్తే 20 శాతం పన్ను(ఇండేక్సేషన్ బెనిఫిట్‌తో)  చెల్లించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం స్టాక్ మార్కెట్ పతన పథంలో ఉంది కదా ! ఈ పరిస్థితుల్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) ప్రారంభించవచ్చా? ఇది సరైన సమయమేనా?                 - రహీమ్, హైదరాబాద్

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్)లో ఇన్వెస్ట్ చేయడానికి ఎప్పుడైనా సరైన సమయమే. గత ఏడాది స్టాక్ మార్కెట్ 15% క్షీణించింది. స్టాక్ మార్కెట్ మరింతగా క్షీణిస్తుం దని, లేదా పెరుగుతుందని ఎవ్వరూ సరిగ్గా అంచనా వేయలేరు. అందుకే మార్కెట్ స్థాయిలను బట్టి ఇన్వెస్ట్‌మెంట్ నిర్ణయాలు తీసుకోకూడదు. మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఈక్విటీల్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయడం ద్వారా  ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించవచ్చు. ఇక సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్)లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ యూనిట్ల సగటు కొనుగోలు ధర తగ్గి, రాబడులు పెరుగుతాయి.

 నేను ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. నా వయస్సు 28 సంవత్సరాలు. నెల జీతం రూ.35,000. ఇటీవలనే పెళ్లి అయింది. నేను నెలకు రూ.5,000 చొప్పున ఈక్విటీల్లో మూడు నుంచి ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. తగిన సలహా ఇవ్వండి. 
                                                                                                                        
- సుబ్బరాజు, రాజమండ్రి
కనీసం ఐదేళ్లకు మించి ఇన్వెస్ట్ చేయగలిగితేనే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. స్వల్పకాలంలో ఈక్విటీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతాయి. మంచి రేటింగ్ ఉన్న ఈక్విటీ ఆధారిత బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టండి. సాధారణంగా తొలిసారిగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారికి బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమని సలహా ఇస్తుంటాం. ఈ బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ ఈక్విటీల్లో కనీసం 65 శాతం, మిగిలినది డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ తరహా కేటాయింపు వ్యూహం కారణంగా ఈక్విటీ ఫండ్స్ కన్నా ఈ బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ కొంచెం తక్కువ ఒడిదుడుకులుగా ఉంటాయి. తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవకుండా తమ ఇన్వెస్ట్‌మెంట్స్ నుంచి మంచి రాబడులను సాధించాలని కోరుకునేవారికి ఈ బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ మంచి ఎంపిక.

ప్రస్తుత పరిస్థితుల్లో మధ్య కాలానికి(3-5 సంవత్సరాలు), దీర్ఘకాలానికి(5 ఏళ్లకు మించి) ఈ గిల్ట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. వీటిల్లో ఒకేసారి కాకుండా దశలవారీగా ఇన్వెస్ట్ చేస్తే సముచితంగా ఉంటుంది. షార్ట్ టర్మ్ గిల్డ్ ఫండ్స్ 4 శాతం వరకూ, మీడియం, లాంగ్‌టర్మ్ గిల్ట్ ఫండ్స్‌లు 3.8 శాతం వరకూ రాబడులనిస్తాయి. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు, వడ్డీరేట్లను ఆర్‌బీఐ పెంచే పరిస్థితులు లేనప్పుడు ఈ గిల్ట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. వడ్డీరేట్లు పెరిగితే, ప్రభుత్వ సెక్యూరిటీల ధరలు తగ్గుతాయి. దీంతో గిల్ట్ ఫండ్స్ రాబడులు కూడా తగ్గుతాయి. ఈ ఫండ్స్‌కు లిక్విడిటీ కూడా ఎక్కువగా ఉండదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement