right time
-
ఇల్లు ఎప్పుడు కొనాలి?
మార్కెట్ పడిపోతున్నప్పుడు కొనడం, పెరుగుతున్నప్పుడు అమ్మటమే లాభసాటి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ చేసే పని! ఇదే సూత్రం రియల్ ఎస్టేట్‌కూ వర్తిస్తుంది. ప్రతికూల సమయంలో కొనుగోలు చేస్తే రేటు కలిసి వస్తుంది. మార్కెట్ బాగున్నప్పుడు విక్రయిస్తే రాబడి రెండింతలవుతుంది. హోమ్ బయ్యర్ నుంచి ఇన్వెస్టర్‌గా ఎదగాలంటే చేయాల్సిందిదే. స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు మాదిరిగానే స్థిరాస్తి రంగానికి కూడా కండీషన్స్ అప్లయి అనేది ఉంటుంది. ప్రాంతం ఎంపిక మొదలు డెవలపర్ ట్రాక్ రికార్డ్, ఆర్థిక పరిస్థితి, ప్రాంతం అభివృద్ధి అవకాశాలు, ప్రాజెక్ట్‌లోని వసతులు వరకు అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని కొనుగోలు చేయాలి. అప్పుడే పెట్టుబడికి తగిన ప్రతిఫలాలను అందుకోవడం సాధ్యం. –సాక్షి, సిటీబ్యూరోఅభివృద్ధిని ముందుగానే అంచనా వేయాలి.. ప్రాంతం అభివృద్ధిని ముందుగా అంచనా వేయగలిగితే దాని ప్రతిఫలాలను వంద శాతం ఆస్వాదించవచ్చు. మెరుగైన మౌలిక వసతులు, భద్రత, కనెక్టివిటీ, నిత్యావసరాలు, అందుబాటు ధర వంటి వాటిని సమీక్షించుకొని ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆయా అంశాల్లో బాచుపల్లి, దుండిగల్, మల్లంపేట, బౌరంపేట ప్రాంతాలు హాట్ డెస్టినేషన్. ఎందుకంటే.. 200 అడుగుల రోడ్లు, ఫ్లై ఓవర్, స్కైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పైగా ఓఆర్ఆర్ దుండిగల్ ఎగ్జిట్ మాత్రమే కాకుండా మల్లంపేట వద్ద మరో ఎగ్జిట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటితో ఇతర జిల్లా కేంద్రాలు, పలు ప్రాంతాలతో కనెక్టివిటీ పెరిగింది. కనెక్టివిటీ ఇబ్బందుల కారణంగా గతంలో ఆఫీసుకు దగ్గరలో ఉండే ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేసేందుకే కస్టమర్లు మొగ్గు చూపేవాళ్లు. కానీ, ఇప్పుడు మెట్రో రైలు, ఫ్లైఓవర్లు, స్కైవేలు, ఓఆర్ఆర్, లింక్ రోడ్లు వంటి వాటితో కనెక్టివిటీ మెరుగైంది. దీంతో ప్రధాన నగరంలోని బడ్జెట్‌తోనే 5–6 కి.మీ. దూరమైనా సరే పెద్ద సైజు అపార్ట్మెంట్ లేదా విల్లా కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.భూమి ధర మేరకే నిర్ణయం... శివారు ప్రాంతాల్లో భూముల క్రయవిక్రయాలు నిలిచిపోయాయంటే దానర్థం రేట్లు పడిపోయాయని కాదు. గత 3–4 ఏళ్లుగా స్థలాల ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రస్తుతం స్థిరంగా నిలిచిపోయాయి. భూమి ధరను బట్టే ఓపెన్ ప్లాట్, అపార్ట్మెంట్, విల్లా వంటి ప్రాజెక్ట్ చేయాలని బిల్డర్లు నిర్ణయించుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త డెవలపర్ ల్యాండ్ కొని, ప్రాజెక్ట్ చేసే పరిస్థితి లేదు. ఒకవేళ ఉన్నా గతంలో స్థల సమీకరణ చేసిన డెవలపర్లు నిర్మించే ప్రాజెక్ట్‌లతో పోలిస్తే ధరలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు బాచుపల్లిలో రెండేళ్ల క్రితం ఎకరం రూ.12–13 కోట్లకు కొనుగోలు చేసిన ప్రణీత్ గ్రూప్ అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తోంది. చదరపు అడుగుకు రూ.5,500 చొప్పున విక్రయిస్తోంది. ఇప్పుడిదే ప్రాంతంలో ఎకరం రూ.20 కోట్లు–25 కోట్లుగా ఉంది. ఇలాంటి చోట కొత్త బిల్డర్ నిర్మించే ప్రాజెక్ట్‌లో ధర చదరపు అడుగుకు రూ.7 వేలు ఉంటే తప్ప గిట్టుబాటుకాని పరిస్థితి. దీంతో ధర తక్కువగా ఉన్న చోట కొనుగోలు చేయడమే కస్టమర్లకు లాభం. పైగా తుది దశకు చేరుకున్న పాత ప్రాజెక్ట్‌ల్లో కొనుగోలు చేస్తే గృహ ప్రవేశం చేసేయొచ్చు.రేపటి అవసరాన్ని గుర్తించి కొనాలి.. ప్రతికూల సమయంలో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో కొనడమే ఉత్తమమని చాలామంది సలహా ఇస్తుంటారు. కానీ, ఒడిదుడుకుల మార్కెట్లో అమ్మకాలు లేకుండా నిర్మాణాన్ని పూర్తి చేసే సామర్థ్యం ఉందా అని ఆలోచించాలి. అందుకే ప్రతికూలంలోనూ బిల్డర్ ట్రాక్ రికార్డ్, ఆర్థిక సామర్థ్యం, గతంలో డెలివరీ చేసిన ప్రాజెక్ట్‌లు వంటి అంశాలను చూసి రెండేళ్లలో పూర్తయ్యే ప్రాజెక్ట్‌లో కొనుగోలు చేసినా నష్టం ఏమీ ఉండదు. పైగా రెడీ టు ఆక్యుపైతో పోలిస్తే వీటిల్లో ధర తక్కువగా ఉంటుంది. విస్తీర్ణం, ఇతరత్రా అంశాలపై బిల్డర్‌తో బేరసారాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. భవిష్యత్తు అవసరాన్ని గుర్తించి వినియోగదారులు గృహాలను కొనుగోలు చేయాలి. చాలామంది ప్రస్తుతం సంపాదించే ఆదాయానికి పరిమితమై నిర్ణయం తీసుకుంటారు. కానీ, రేపటి రోజున ఆదాయ సామర్థ్యం పెరగొచ్చు. పెద్ద ఇళ్లు అవసరం ఏర్పడొచ్చు. అందుకే ఈ రోజు 2 బీహెచ్‌కే కొనేచోట 2–3 ఏళ్లలో డెలివరీ చేసే ప్రాజెక్ట్‌లో 2.5 బీహెచ్‌కే కొనుగోలు చేయడం ఉత్తమం. పైగా నిర్మాణంలో ఉంటుంది కాబట్టి 2 బీహెచ్‌కే ధరకే వస్తుంది. -
కశ్మీర్లో ‘సరైన సమయం’లో ఎన్నికలు: ఈసీ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని సరైన సమయంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషన్(సీఈసీ) రాజీవ్ కుమార్ సోమవారం చెప్పారు. ఏది సరైన సమయం అని తాము భావిస్తామో అప్పుడే అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఇతర ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఆరి్టకల్ 370ని రద్దు చేసి, జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత అక్కడ ఎన్నికలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ స్థానాల సంఖ్య 83 నుంచి 90కి పెరిగింది. -
సస్యరక్షణకు సమయమిదే!
అనంతపురం అగ్రికల్చర్ : రబీలో వేసిన వేరుశనగకు అక్కడక్కడా ఆకుముడుత పురుగు ఆశించినందున సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.సహదేవరెడ్డి తెలిపారు. అలాగే వాతావరణానికి అనుగుణంగా కంది, పత్తి, వరి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడంతోపాటు కోళ్లు, గొర్రెల పెంపకందారులకూ కొన్ని సూచనలు చేశారు. - రబీ పంటగా నీటి వసతి కింద సాగు చేసిన వేరుశనగకు అక్కడక్కడా ఆకుముడుత తెగులు కనిపిస్తోంది. దీని నివారణకు ఎకరాకు 400 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్ లేదా 320 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 500 మిల్లీలీటర్ల క్లోరోఫైరిపాస్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. - ఈ నెల 20వ తేదీలోగా రబీ వేరుశనగ సాగు చేసుకోవాలి. 3 గ్రాముల మాంకోజెబ్ + 2 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. దీనివల్ల విత్తనం, భూమి ద్వారా వచ్చే చీడపీడలు, తెగుళ్లను అరికట్టవచ్చు. ఎకరాకు 18 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్‌ఫాస్పేట్ ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. - కందిలో శనగపచ్చ పురుగు ఆశించినందున పూత, కాయ దశల్లో ఉన్న పంటకు 2 మి.లీ. క్వినాల్ఫాస్ లేదా 1.5 మి.లీ. అసిఫేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే మారుకామచ్చల పురుగు నివారణకు 2.5 మి.లీ. క్లోరోఫైరిపాస్ లేదా 1 గ్రాము అసిఫేట్ లేదా 1 గ్రాము థయోడికార్బ్ లేదా 0.75 మి.లీ. నొవాల్యురాన్ లేదా 0.2 మి.లీ. స్పైనోసాడ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అవకాశం ఉంటే నీటి తడులు ఇచ్చుకోవాలి. - పత్తిలో గులాబీరంగు కాయతొలచు పురుగు ఆశించిన ప్రాంతాల్లో ఎకరాకు నాలుగు నుంచి 6 ఫిరమోన్ ఎరలు ఏర్పాటు చేసుకుని పురుగు ఉనికి, ఉధృతిని గమనించాలి. నివారణకు 2 మి.లీ. ప్రొపికొనజోల్ కానీ, 1.5 గ్రాముల లార్విన్ కానీ 2 మి.లీ. క్లోరోఫైరిపాస్ కానీ ఏదో ఒకటి తీసుకుని దానికి 1 మి.లీ.నువాన్ను జత చేసి లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. - వరిలో సుడిదోమ నివారణకు 1.6 మి.లీ. బుప్రోపెజిన్ లేదా 2 మి.లీ. ఇథోఫెన్ఫ్రోక్స్ లేదా 1.5 గ్రాముల అసిఫేట్ లేదా ఇమిడాక్లోప్రిడ్కు 0.25 గ్రాములు ఎథిప్రోల్ను జత చేసి లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. - ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గినందున కోళ్ల ఫారాలలో ఇన్ఫ్రారెడ్ బల్బులు లేదా కృత్రిమ ఇంక్యుబేటర్ల ద్వారా ఉష్ణోగ్రతలను నియంత్రించుకోవాలి. కోళ్ల పెంటను అమ్మోనియా వాసన లేకుండా ఎప్పటికప్పుడు తీసివేస్తుండాలి. - ప్రస్తుత వాతావరణంలో గొర్రెల్లో నీలినాలుక (బ్లూటంగ్) వ్యాధి వచ్చే ప్రమాదం ఉన్నందున ముందస్తుగా టీకాలు వేయించుకోవాలి. వాతావరణం పొడిగా ఉంటుంది వచ్చే మూడు రోజులు జిల్లాలో వాతావరణం పొడిగా ఉంటుంది. హైదరాబాద్ వాతావరణ శాఖ అందించిన సమాచారం మేరకు ఈ నెల 11వ తేదీ వరకు ఎలాంటి వర్షసూచనా లేదు. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 33 డిగ్రీల వరకు, రాత్రిళ్లు 19 నుంచి 21 డిగ్రీల వరకు నమోదు కావచ్చు. గాలిలో తేమ ఉదయం 55 నుంచి 80 శాతం, మధ్యాహ్నం 32 నుంచి 44 శాతం మధ్య ఉండవచ్చు. గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. -
ఈక్విటీ సిప్ కు సరైన సమయమేది?
ఐసీఐసీఐ ప్రు ఇలైట్ వెల్త్ టూ-మాక్సిమైజర్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయమని మిత్రుడొకరు సలహా ఇస్తున్నారు. ఏడాదికి రూ.5 లక్షల చొప్పున ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది సరైన ఇన్వెస్ట్మెంట్ విధానమేనా ? లేకుంటే మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)లో ఇన్వెస్ట్ చేయమంటారా ? తగిన సలహా ఇవ్వగలరు. - ప్రకాశ్ , విశాఖపట్టణం ఐసీఐసీఐ ప్రు ఇలైట్ లైఫ్ టూ అనేది యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ. బీమాను, పెట్టుబడులను కలగలిపిన పాలసీ ఇది, ఈ తరహా పాలసీల్లో వ్యయాలు అధికంగా ఉంటాయి. కాబట్టి మదుపు చేయడానికి ఈ తరహా పాలసీలు సరైనవి కావు. ఇన్వెస్ట్మెంట్ కోసం ఎప్పుడు బీమా పాలసీల్లో ఇన్వెస్ట్ చేయకూడదు. జీవిత బీమా అవసరాల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. ఇక మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. మీ ఆర్థిక లక్ష్యాలు, మీరు భరించగలిగే రిస్క్‌ను బట్టి మీ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎంత కాలం ఇన్వెస్ట్ చేస్తే పన్ను మినహాయింపులు పొందవచ్చు? - సౌజన్య, వరంగల్ ఈక్విటీ, డెట్ ఫండ్స్‌కు పన్ను నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను ఇన్వెస్ట్ చేసిన ఏడాదిలోపే విక్రయిస్తే, వీటిపై వచ్చిన లాభాలను స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది తర్వాత వీటిని విక్రయిస్తే వచ్చే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను ఏమీ చెల్లించాల్సిన పనిలేదు. ఇక డెట్ ఫండ్స్ విషయానికొస్తే, మూడేళ్లలోపు వీటిని విక్రయిస్తే, వీటిపై వచ్చిన లాభాలను స్వల్పకాలిక మూలధన లాభాల పన్నుగా పరిగణించి మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. డెట్ ఫండ్స్‌ను మూడేళ్ల తర్వాత విక్రయిస్తే 20 శాతం పన్ను(ఇండేక్సేషన్ బెనిఫిట్‌తో) చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ పతన పథంలో ఉంది కదా ! ఈ పరిస్థితుల్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) ప్రారంభించవచ్చా? ఇది సరైన సమయమేనా? - రహీమ్, హైదరాబాద్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)లో ఇన్వెస్ట్ చేయడానికి ఎప్పుడైనా సరైన సమయమే. గత ఏడాది స్టాక్ మార్కెట్ 15% క్షీణించింది. స్టాక్ మార్కెట్ మరింతగా క్షీణిస్తుం దని, లేదా పెరుగుతుందని ఎవ్వరూ సరిగ్గా అంచనా వేయలేరు. అందుకే మార్కెట్ స్థాయిలను బట్టి ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోకూడదు. మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఈక్విటీల్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించవచ్చు. ఇక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ యూనిట్ల సగటు కొనుగోలు ధర తగ్గి, రాబడులు పెరుగుతాయి. నేను ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. నా వయస్సు 28 సంవత్సరాలు. నెల జీతం రూ.35,000. ఇటీవలనే పెళ్లి అయింది. నేను నెలకు రూ.5,000 చొప్పున ఈక్విటీల్లో మూడు నుంచి ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. తగిన సలహా ఇవ్వండి. - సుబ్బరాజు, రాజమండ్రి కనీసం ఐదేళ్లకు మించి ఇన్వెస్ట్ చేయగలిగితేనే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. స్వల్పకాలంలో ఈక్విటీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతాయి. మంచి రేటింగ్ ఉన్న ఈక్విటీ ఆధారిత బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టండి. సాధారణంగా తొలిసారిగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారికి బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమని సలహా ఇస్తుంటాం. ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఈక్విటీల్లో కనీసం 65 శాతం, మిగిలినది డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ తరహా కేటాయింపు వ్యూహం కారణంగా ఈక్విటీ ఫండ్స్ కన్నా ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్ కొంచెం తక్కువ ఒడిదుడుకులుగా ఉంటాయి. తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవకుండా తమ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి మంచి రాబడులను సాధించాలని కోరుకునేవారికి ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్ మంచి ఎంపిక. ప్రస్తుత పరిస్థితుల్లో మధ్య కాలానికి(3-5 సంవత్సరాలు), దీర్ఘకాలానికి(5 ఏళ్లకు మించి) ఈ గిల్ట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. వీటిల్లో ఒకేసారి కాకుండా దశలవారీగా ఇన్వెస్ట్ చేస్తే సముచితంగా ఉంటుంది. షార్ట్ టర్మ్ గిల్డ్ ఫండ్స్ 4 శాతం వరకూ, మీడియం, లాంగ్‌టర్మ్ గిల్ట్ ఫండ్స్‌లు 3.8 శాతం వరకూ రాబడులనిస్తాయి. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు, వడ్డీరేట్లను ఆర్బీఐ పెంచే పరిస్థితులు లేనప్పుడు ఈ గిల్ట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. వడ్డీరేట్లు పెరిగితే, ప్రభుత్వ సెక్యూరిటీల ధరలు తగ్గుతాయి. దీంతో గిల్ట్ ఫండ్స్ రాబడులు కూడా తగ్గుతాయి. ఈ ఫండ్స్‌కు లిక్విడిటీ కూడా ఎక్కువగా ఉండదు.