అచ్చం అలాంటివే | Ezetap's payment solution aims to drive e-commerce in India | Sakshi
Sakshi News home page

అచ్చం అలాంటివే

Published Sat, Mar 1 2014 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM

అచ్చం అలాంటివే

అచ్చం అలాంటివే

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:  ‘‘మిర్చి’ సినిమాలో.. క్రీమ్ కలర్ ప్యాంట్ మీద వైట్ షర్ట్‌ను టక్ చేసిన హీరో ప్రభాష్ డ్రెస్ ఉంది రా బాబూ.. సూపర్’’

 ‘‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాలో.. వైట్ కలర్ చీర మీద పసుపు రంగు బార్డర్, మెడలో తెల్లని హారంతో హీరోయిన్ దీపికా పడుకొనే వేసుకున్న డ్రెస్ చూడ్డానికి రెండు కళ్లు సరిపోలేదే..’’

 ఇలా సినిమాల్లో మనకు నచ్చిన హీరో, హీరోయిన్లు వేసుకున్న డ్రెస్‌లు చూసి కామెంట్ చేసుకోవటం కొత్తేమీ కాదు. అచ్చం అలాంటివే వేసుకోవాలనిపిస్తుంది కూడా. కానీ ఏం లాభం! అవి దొరుకుతాయా? ఎక్కడ కొనాలో తెలియక మిన్నకుండి పోతాం. కానీ, ఐఐటీ-హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్న కుర్రకారు అలా ఊరుకోలేదు. తమ అభిమాన హీరోల గురించే కాదు. ఎదుటి వారి అభిమానాన్ని కూడా తీర్చేందుకు రంగం సిద్ధం చేశారు. తమ చదువులకు సాంకేతికతను జోడించి ఠీఠీఠీ.ఛ్చిఞ్ఛౌ.ఛిౌఝ వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఇదీ ఆ వెబ్‌సైట్ కథ!

 అనంతపురం జిల్లాకు చెందిన చిన్మయి రాజు, గుంటూరు జిల్లాకు చెందిన మామిడి రాజ రూపొందించిన ఈ వెబ్‌సైట్‌లో మన  అభిమాన హీరో, హీరోయిన్లు ఆయా సినిమాల్లో వేసుకున్న డ్రెస్సులు, చీరలు, షూ, చెప్పులు.. ఇలా ప్రతీదీ కొనుగోలు చేయవచ్చు. అసలు దీనికెలా రూపకల్పన జరిగిందని అడిగితే... ‘ఈగ’తోనే అంతా మొదలైందని చెబుతారు వాళ్లిద్దరూ. ‘‘ఓ రోజు మా ఫ్యామిలీ అంతా కలసి ‘ఈగ’ సినిమాకు వెళ్లాం. ఆ సినిమాలో సమంత వేసుకున్న టాప్ చూసి నాకూ అలాంటిది కావాలని మా చెల్లి నన్నడిగింది. దానికోసం హైదరాబాద్‌లో చాలా షాపింగ్ చేశా.

 ఈ-కామర్స్ వెబ్‌సైట్లలోనూ వెతికినా దొరకలేదు.  దానికి కాస్త దగ్గర్లో ఉన్న టాప్ దొరికింది. కానీ ఏదో వెలితి. ‘అరె.. మనకు కావాల్సిన డ్రెస్సు డబ్బులు పెట్టి కొందామన్నా దొరకదా?’ అనిపించింది. వెంటనే మా స్నేహితుడితో చర్చించా. ఏడాదిపాటు వెబ్‌సైట్ రూపకల్పనకు శ్రమించాం. ఏప్రిల్ 2013లో ఠీఠీఠీ.ఛ్చిఞ్ఛౌ.ఛిౌఝ వెబ్‌సైట్‌ను ప్రారంభించాం. డోర్ డెలి వరీకి వీలుగా జబాంగ్, ఫ్లిప్‌కార్ట్, ఫ్యాషన్‌ఎరా వంటి 36 ఈ-కామర్స్ వెబ్‌సైట్లతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ప్రస్తుతం మా కంపెనీలో ఆరుగురు పనిచేస్తున్నారు’’ అని రాజు వివరించారు.

 ఎలా కొనాలి?
 వెబ్‌సైట్‌కు లాగిన్ కాగానే మనకు టాలీవుడ్, బాలీవుడ్ సినీ తారలు ఫొటోలు డిస్‌ప్లే అవుతాయి. అభిమాన సినీ తార ఫొటో మీద క్లిక్ చేయగానే వెంటనే మీ వివరాలను అడుగుతారు. అవి పూర్తి చేయగానే మీరు క్లిక్ చేసిన సినీ తారల తాలూకు డ్రెస్సులు, యాక్సెసరీలు ప్రత్యక్షమవుతాయి. వాటి మీద క్లిక్ చేస్తే చాలు కోరుకున్న డ్రెస్సులు, యాక్సెసరీలు ఇంటికొచ్చేస్తాయి.
 షర్టుల నుంచి గోళ్ల పెయింట్ల వరకు..: టాలీవుడ్, బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు ఆయా చిత్రాల్లో వేసుకున్న షర్టులు, జీన్స్, టై, షూ, చెప్పులు, పర్సులు, గాజులు, చెవి రింగులు, గోళ్ల రంగులు, చేతి బ్యాండ్లు, ఆభరణాలు.. ఇలా ప్రతీది ఛ్చిఞ్ఛౌ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు.

 మరి డబ్బులెలా కట్టాలి..: ఛ్చిఞ్ఛౌ.ఛిౌఝలో నచ్చిన డెస్సులు, యాక్సెసరీలను ఆర్డర్ చేశాక ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా డబ్బులు కట్టొచ్చు. లేకపోతే మీ చిరునామాకు సంబంధిత వెబ్‌సైట్ నిర్వాహకులు మీరు ఆర్డర్ చేసిన డ్రెస్సులు, యాక్ససరీలు తీసుకొచ్చాక నేరుగా చేతికి డబ్బులు కట్టే సదుపాయం కూడా ఉంది.

 36 ఈ-కామర్స్ వెబ్‌సైట్లతో..: ఈ వెబ్‌సైట్ నిర్వాహకులు ఆన్‌లైన్ వ్యాపారాన్ని ఎలా చేస్తారంటే.. ముందుగా ఛ్చిఞ్ఛౌ.ఛిౌఝ వెబ్‌సైట్‌లో మనకు నచ్చిన డ్రెస్సులను ఆర్డర్ చేస్తాం. దాన్ని అందుకున్న నిర్వాహకులు తాము ఒప్పందం కుదుర్చుకున్న 36 ఈ-కామర్స్ వెబ్‌సైట్లకు ఈ ఆర్డర్లను పంపిస్తారు. దీంతో మనం ఆర్డర్ చేసిన డెస్సులు ఆయా వెబ్‌సైట్  నిర్వాహకులు మన ఇంటికి పంపిస్తారు.

 త్వరలోనే వెండితెర, బుల్లితెరలోకి కూడా..
 ఇప్పటివరకు ఛ్చిఞ్ఛౌ.ఛిౌఝ వెబ్‌సైట్‌లో మనకు నచ్చిన అభిమాన హీరో, హీరోయిన్లు వేసుకున్న డ్రెస్సులు, యాక్ససరీలను పోలినవి, లేక వాటికి దగ్గరగా ఉన్నవి మాత్రమే కొనుగోలు చేసే అవకాశముంది. అయితే, కొందరు సినీ నిర్మాతలు తమ సినిమాల్లోని హీరోలు, హీరోయిన్లు వేసుకునే డ్రెస్సులు, యాక్సెసరీలను ఈ వెబ్‌సైట్ ద్వారా విక్రయించమని అడిగారని‘సాక్షి’తో చిన్మయి రాజు చెప్పారు. ‘అందుకే ఏప్రిల్ నుంచి సినిమాలో హీరోలు, హీరోయిన్లు వేసుకున్న డ్రెస్సుల్ని నేరుగా విక్రయించే వ్యాపారాన్ని కూడా ప్రారంభిస్తున్నాం. మార్చి నుంచి సీరియళ్లలోని నటీనటులు వేసుకునే డ్రెస్సులు, యాక్సెసరీలను విక్రయించడం కూడా మొదలు పెడుతున్నాం’’ అని తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement