start-ups
-
Suchana Seth: కసాయిగా మారిన కన్నతల్లి.. కొడుకునెందుకు చంపింది?
గోవాలో కన్నకొడుకుని హతమార్చిన బెంగుళూరు సీఈఓ ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. స్టార్టప్ కంపెనీకి సీఈఓ, ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్‌లో మేధావి అయిన మహిళ నాలుగేళ్ల పసివాడిని గోవాలో అతి కిరాతకంగా చంపిన ఘటన ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అంతేగాక చిన్నారి మృతదేహాన్ని బ్యాగ్‌లో కుక్కి రహస్యంగా బెంగుళూరుకు తీసుకురావడాన్ని తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పుడుస్తోంది పనాజీ/ బెంగళూరు: నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసిన కేసులో నిందితురాలిని చిత్రదుర్గ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. కన్నతల్లి అంత కసాయిరాలుగా ఎందుకు మారింది.. పేగు బంధాన్ని తెంపుకొని కొడుకును హత్య చేయడానికి గల కారణాలేంటనే విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. చిన్నారిని చంపేందుకు అదే కారణమా? 39 ఏళ్ల సుచనకు, ఆమె భర్త వెంకట్ రామన్‌కు మధ్య వివాదాలే చిన్నారి హత్యకు దారితీసినట్లు గోవా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సీఈఓకు భర్త వెంకట్ రామన్ మద్య గొడవలు రావడంతో ఇద్దరు విడిపోయారు. వీరి విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. అయితే కుమారుడిని భర్త నుంచిదూరంగా ఉంచేందుకు గోవా టూర్ ప్లాన్ చేసింది. గత శనివారం నార్త్ గోవాలోని బనియన్ గ్రాండ్ హోటల్లో దిగింది. తన కుమారుడితో కలిసి చెక్ ఇన్ అయ్యింది. అక్కడే గుట్టుచప్పుడు కాకుండా చిన్నారిని హతమార్చింది. అనంతరం బెంగుళూరుకు ట్యాక్సీ బుక్ చేయాలని ఆమె హోటల్ సిబ్బందిని కోరింది. కొడుకుతో కలిసి హోటల్ లోపలికి వెళ్లిన మహిళా.. సోమవారం ఒంటరిగా బయటికి వెళ్లడాన్ని గమనించిన సిబ్బందికి అనుమానం రావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ గదిని శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది.. అక్కడ రక్తపు మరకలను గుర్తించడంతో పోలీసులకు సమాచారం అందించారు. సంబంధిత వార్త: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అపర మేధావి.. ఎవరీ సుచనా సేథ్! బ్యాగ్‌లో దాచి.. గోవా నుంచి కర్ణాటకకు.. ఇంతలో ఎవరికి అనుమానం రాకుండా కొడుకు మృతదేహాన్ని బ్యాగులో దాచిపెట్టిన మహిళ.. గోవా నుంచి కర్ణాటక వరకు ట్యాక్సీలో ప్రయాణించింది. మరోవైపు గోవా పోలీసులు ట్యాక్సీ డ్రైవర్‌కు కాల్ చేసి కుమారుడి గురించి చెప్పాలని సీఈవో సుచననాను అడిగారు. తన స్నేహితురాలి వద్ద కొడుకు ఉన్నాడని చెప్పి ఆమె అడ్రస్ ఇచ్చింది. అయితే ఆ అడ్రస్ ఫేక్ అని తెలుసుకున్న పోలీసులు మళ్లీ క్యాబ్ డ్రైవర్‌కు కాల్ చేసి సుచనాకు అర్థం కాకుండా ఉండేందుకు కొంకణి భాషలో మాట్లాడారు. దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్‌కు వెళ్లాలంటూ ఆ డ్రైవర్‌కు పోలీసులు చెప్పడంతో అతడు తన కార్‌ను నేరుగా దగ్గర్లోని చిత్రదుర్గ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లాడు. దీంతో చిత్రదుర్గలో సుచనాను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ప్రయాణిస్తున్న కారులో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. నేరం అంగీకరించిన మహిళను.. ఈ కేసులో విచారణ నిమిత్తం పోలీసులు మళ్లీ గోవాకు తీసుకెళ్లారు. ఎవరీ సుచనా.. లింక్డ్ఇన్ ఫ్రొఫైల్‌లోని వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన సుచన.. కలకత్తాలోని యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. ఆస్ట్రోఫిజిక్స్‌తో పాటు ప్లాస్మా ఫిజిక్స్‌లో నైపుణ్యం సాధించింది. అదే విధంగా సంసృతంలో పీజీ పట్టా అందుకుంది. తరువాత ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్, డేటా సైంటిస్ట్‌గా ప్రావిణ్యం పొందింది. ఈ రంగంలో ఆమెకు 12 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ క్రమంలో 2020లో మైండ్‌ఫుల్ ఏఐ ల్యాబ్ అనే స్టార్టప్ కంపెనీని స్థాపించి.. దానికి సీఈవోగా వ్యవహరిస్తోంది. కాగా 100 బ్రిలియంట్ వుమెన్ ఇన్ ఏఐ ఎథిక్స్ ఫర్ 2021లో సుచనా టాప్ ప్లేస్‌లో ఉన్నారు. -
హురూన్ జాబితాలో 19 ఏళ్ల వ్యాపారవేత్త
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా సంపన్నుల జాబితా–2022లో రూ.10,94,400 కోట్ల సంపదతో గౌతమ్ అదానీ, కుటుంబం తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. రూ.7,94,700 కోట్లతో ముకేశ్ అంబానీ, కుటుంబం రెండవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాలను వరుసగా రూ.2,05,400 కోట్లతో సైరస్ ఎస్ పూనావాలా కుటుంబం (సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా), రూ.1,85,800 కోట్లతో శివ్ నాడార్ కుటుంబం (హెచ్‌సీఎల్), రూ.1,75,100 కోట్లతో రాధాకిషన్ దమానీ, కుటుంబం (అవెన్యూ సూపర్‌మార్ట్స్) దక్కించుకుంది. రూ.1,000 కోట్లకుపైగా సంపద కలిగిన వ్యాపారవేత్తలతో ఈ జాబితా తయారైంది. ఇందులో దేశవ్యాప్తంగా 1,103 మంది చోటు సంపాదించారు. గతేడాదితో పోలిస్తే 96 మంది కొత్తగా చేరారు. లిస్ట్‌లో స్థానం పొందిన వ్యాపారవేత్తల మొత్తం సంపద రూ.100 లక్షల కోట్లకు చేరుకుంది. 19 ఏళ్ల యువ వ్యాపారవేత్త, జెప్టో ఫౌండర్ కైవల్య వోరా జాబితాలో ఉన్నవారిలో పిన్న వయస్కుడు. తెలుగు రాష్ట్రాల నుంచి.. జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి 78 మంది చోటు సంపాదించారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. రూ.56,200 కోట్ల సంపదతో మురళి దివీ, కుటుంబం (దివీస్ ల్యాబొరేటరీస్) మొదటి స్థానంలో ఉంది. రూ.39,200 కోట్లతో బి.పార్థ సారధి రెడ్డి, కుటుంబం (హెటిరో ల్యాబ్స్) రెండవ స్థానం కైవసం చేసుకుంది. రూ.16,000 కోట్లతో ఎం.సత్యనారాయణ రెడ్డి కుటుంబం (ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్), రూ.15,000 కోట్లతో జి.అమరేందర్ రెడ్డి, కుటుంబం (జీఏఆర్), రూ.13,300 కోట్లతో రామేశ్వర్రావు జూపల్లి కుటుంబం (మై హోమ్ ఇండస్ట్రీస్) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రూ.12,600 కోట్లతో పి.పిచ్చిరెడ్డి (మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్) ఆరవ స్థానం, రూ.12,100 కోట్లతో పి.వి.కృష్ణారెడ్డి (మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్) ఏడవ స్థానం, రూ.11,300 కోట్లతో కె.సతీష్ రెడ్డి, కుటుంబం (డాక్టర్ రెడ్డీస్) ఎనిమిదవ స్థానం, రూ.9,000 కోట్లతో వెంకటేశ్వర్లు జాస్తిని కుటుంబం (సువెన్ ఫార్మా) తొమ్మిదవ స్థానం, రూ.8,700 కోట్లతో మహిమ దాట్ల కుటుంబం (బయాలాజికల్–ఇ) 10వ స్థానంలో నిలిచారు. -
స్టార్టప్ ఇండియాతో అమెజాన్ జట్టు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్ సంస్థలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కల్పించే దిశగా కృషి చేస్తున్నట్లు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ వెల్లడించింది. ఇందులో భాగంగా స్టార్టప్ ఇండియా, సెకోయా క్యాపిటల్ ఇండియా, ఫైర్‌సైడ్ వెంచర్స్‌తో చేతులు కలిపినట్లు, స్టార్టప్స్ కోసం యాక్సిలరేటర్ ప్రోగ్రాం ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ప్రొపెల్ (ఏజీఎస్‌పీ) పేరిట రూపొందించిన ఈ ప్రోగ్రాంలో భాగంగా దేశ, విదేశాలకు చెందిన అమెజాన్ లీడర్స్, స్టార్టప్ ఇండియాకి సంబంధించిన వెంచర్ క్యాపిటలిస్టులు, సీనియర్ లీడర్లు.. మార్గదర్శకులుగా వ్యవహరిస్తారు. ఎంపిక చేసిన 10 అంకుర సంస్థలకు ఆరు వారాల పాటు ఈ–కామర్స్ ద్వారా ఎగుమతుల వ్యాపారాన్ని పెంచుకునేందుకు తోడ్పడే మెళకువలను వివరిస్తారు. అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ప్రోగ్రాం ద్వారా ఆయా స్టార్టప్‌లు తమ తమ ఉత్పత్తులను అంతర్జాతీయంగా విక్రయించుకునేందుకు అమెజాన్ తోడ్పాటు అందిస్తుంది. అంతే గాకుండా సెకోయా క్యాపిటల్, ఫైర్‌సైడ్ వెంచర్స్ వంటి వెంచర్ క్యాపిటల్ సంస్థలకు తమ వ్యాపార సామర్థ్యాలను గురించి వివరించేందుకు కూడా స్టార్టప్‌లకు అవకాశం దక్కుతుందని అమెజాన్ ఇండియా డైరెక్టర్ (గ్లోబల్ ట్రేడ్) అభిజిత్ కామ్రా తెలిపారు. వీటిలో మూడు అంకుర సంస్థలు.. అమెజాన్ నుంచి 50,000 డాలర్ల గ్రాంట్ కూడా దక్కించుకోవచ్చని పేర్కొన్నారు. -
బైజూస్ మరో రికార్డు
సాక్షి, ముంబై: 4 కోట్ల రికార్డు డౌన్లోడ్లతో దూసుకుపోతున్న ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ బైజూస్ తాజాగా భారీ పెట్టుబడులను సాధించింది. న్యూయార్క్ కేంద్రంగా ఉన్న హెడ్జ్ ఫండ్ సంస్థ టైగర్ గ్లోబల్ నుంచి 200 డాలర్లను పెట్టుబడులను కొట్టేసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆన్ లైన్ లెర్నింగ్ యాప్ బైజూస్ వ్యవస్థాపకుడు సీఈవో రవీంద్రన్ ప్రకటించారు. దీంతో బెంగళూరుకేంద్రంగా పనిచేస్తున్న బైజూస్ వాల్యూ 8 బిలియన్ల డాలర్లు మించిపోతుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనితో 2015 లో స్థాపించబడిన బైజూస్ భారతదేశంలో మూడవ అత్యంత విలువైన స్టార్టప్‌గా అవతరించింది. టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్ వంటి బలమైన పెట్టుబడిదారుడితో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని బైజూస్ సీఈవో తెలిపారు. విద్యార్థులు నేర్చుకునే విధానంలో పలుమార్పులు తీసుకురావాలన్న తమ దీర్ఘకాలిక దృష్టికి, ఆవిష్కరణలకు మరో అడుగు ముందుకు పడినట్టు రవీంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. టైర్ 2, 3 నగరాల్లో అభ్యాసకులకు అందుబాటులో ఉండేలా మాతృభాషలో తమ ప్రోగ్రామ్‌లను ప్రారంభించటానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు రాబోయే నెలల్లో ఆన్లైన్ పాఠాలకోసం ఒక స్టార్ట్-అప్ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. గత 12 నెలల్లో, గ్రామీణ, పట్టణాల్లో 42 మిలియన్ల రిజిస్టర్డ్ యూజర్లు, 3 మిలియన్ల చెల్లింపు చందాదారులు తమ యాప్‌లో ఉన్నారని పేర్కొన్నారు. అలాగే సంస్థ ప్రకారం, ఒక విద్యార్థి అనువర్తనంలో గడిపే సగటు నిమిషాల సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే రోజుకు 64 నిమిషాల నుండి 71 నిమిషాలకు పెరిగింది. వార్షిక సభ్యత్వాల రెన్యూవల్ రేట్లు 85శాతం పుంజుకుంది. మరోవైపు భారతదేశంలో మిలియన్ల మంది పాఠశాల విద్యార్థుల మన్ననలు పొందుతూ, విద్య-సాంకేతిక రంగంలో అగ్రగామిగా ఉన్న బైజూస్ బృందానికి మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉందని టైగర్ గ్లోబల్ భాగస్వామి స్కాట్ ష్లీఫర్ తెలిపారు. -
ఐదు స్టార్టప్‌లతో మారుతి జత
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ ఆటోదిగ్గజం మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) నూతన ఆవిష్కరణలకోసం కీలక నిర్ణయం తీసుకుంది. తన మొబిలిటీ అండ్ ఆటోమొబైల్ ఇన్నోవేషన్ ల్యాబ్ (మెయిల్) ప్రోగ్రాం కింద ఐదు స్టార్టప్‌లను ఎంపిక చేసినట్లు సోమవారం తెలిపింది. ప్రధానంగా కృత్రిమ మేధస్సు పై పనిచేస్తున్న సెన్స్ గిజ్, క్సేన్, ఐడెంటిఫై, ఎన్మోవిల్, డాకెట్‌రన్ అనే ఐదు స్టార్టప్‌లతో జతకట్టింది. ఈ ఒప్పందాల ద్వారా ఆటోమొబైల్ రంగంలో వినూత్న, అత్యాధునిక సొల్యూషన్స్‌తో ముందుకు వస్తున్న స్టార్టప్‌లను గుర్తించి, ఒకచోటకు తీసుకొచ్చినట్టు తెలిపింది. మారుతి సుజుకి వాటాదారుల ప్రయోజనాలను నిలుపుకుంటూ, భారతీయ కస్టమర్ల అవసరాలకు అవసరాల కంటే ముందుగానే అభివృద్ధి చెందుతున్న కొత్త టెక్నాలజీ సేవలను అందిచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఎంఎస్ఐ ఎండి, సీఈవో కెనిచి ఆయుకావా వెల్లడించారు. ఈ స్టార్టప్‌లతో భాగస్వామ్యం కావడం ద్వారా ఆటోమొబైల్ సొల్యూషన్ కొత్త యుగంలోకి ప్రవేశించామన్నారు. స్టార్టప్‌లతో పాటు పనిచేయడం ద్వారా పరిష్కారాల స్కేలబిలిటీని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇవి కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయన్నారు. ప్రస్తుతానికి మారుతి సుజుకిలోని డొమైన్ నిపుణుల మార్గనిర్దేశనంపాటు, భవిష్యత్తులో దేశీయ, అంతర్జాతీయ స్టార్టప్ మార్కెట్ నిపుణుల ద్వారా మొత్తం ఐదు స్టార్టప్‌లకు మూడు నెలల సుదీర్ఘ యాక్సలరేషన్ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. -
మహిళా స్టార్టప్స్.. ఇదీ మన పరిస్థితి!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్ కంపెనీలు పెరుగుతున్నా.. మహిళా వ్యాపారులు మాత్రం వాటిల్లో పెద్దగా రాణించడం లేదు. స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేయడంలో ప్రపంచవ్యాప్తంగా మహిళా వ్యాపారులకు అనువైన 50 ఉత్తమ నగరాల జాబితాలో భారత్‌కు చెందిన రెండు నగరాలకు మాత్రమే చోటులభించింది. భారత్ సిలికాన్ వ్యాలీగా గణతికెక్కిన బెంగళూరు నగరానికి 40వస్థానం లభించగా, ఢిల్లీ నగరానికి 49వ స్థానం లభించింది. మొదటి పది నగరాల జాబితాలో న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, లండన్, బోస్టన్, స్టాక్ హోమ్, లాస్ ఏంజిలెస్, వాషింగ్టన్ డీసీ, సింగపూర్, టొరాంటో, సియాటిల్, సిడ్నీ నగరాలు ఆక్రమించాయి. బెంగళూరు, ఢిల్లీ నగరంతోపాటు ఆసియా నగరాల్లో సింగపూర్ 8వ స్థానాన్ని, హాంకాంగ్ 16, థైపీ 22, బీజింగ్ 38, టోక్యో 39, కౌలాలంపూర్ 41, శాంఘై 44వ స్థానాన్ని లేదా ర్యాంక్‌ను సాధించాయి. ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ కలిగిన దేశాల్లో బెంగళూరుకు పదవ స్థానం లభించినప్పటికీ మహిళా స్టార్టప్ కంపెనీల్లో వెనకబడి పోవడం విచారకరం. మహిళా వ్యాపారులు, విధాన నిర్ణేతలు, వెంచర్స్ క్యాపిటలిస్టులు, మీడియా ప్రతినిధులు, విద్యావేత్తల అభిప్రాయాలను సేకరించడం ద్వారా ఈ నగరాల జాబితాను డెల్ టెక్నాలజీ కంపెనీ, ఐహెచ్ఎస్ మార్కెట్ కన్సల్టెనీ రూపొందించింది. -
టెక్ దిగ్గజాలు ఎందుకు చెక్కేస్తున్నారు?
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా’ పథకాలకు ఆకర్షితులై స్వదేశీ, విదేశీ ఆన్లైన్ కంపెనీలు ఎన్నో ప్రపంచంలో మూడవ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్‌కు విస్తరించాయి. కళ్లు చెదిరే జీత భత్యాలను ఎరగా వేసి సిలికాన్ వ్యాలీలో పనిచేస్తున్న భారతీయ దిగ్గజాలను తీసుకొచ్చి బాస్‌లుగా కూర్చోబెట్టాయి. కానీ ఈ బాసుల్లో ఎక్కువ మంది కంపెనీల్లో నిలదొక్కుకోకుండానే మరో చోటుకు చెక్కేస్తున్నారు. ఫలితంగా కొన్ని స్టార్టప్ కంపెనీలు తెరవకుండా మూసుకోవాల్సి వస్తోంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి గతేడాది ఏప్రిల్ నెలలో పునీత్ సోని తప్పుకోగా, ఆ తర్వాత మే నెలలో స్నాప్‌డీల్ నుంచి చీఫ్ ప్రాడక్ట్ ఆఫీసర్ ఆనంద్ చంద్రశేఖరన్ ఏడాది తిరక్కుండానే తప్పుకున్నారు. 2014 ఫేస్బుక్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నమితా గుప్తా, రెస్టారెంట్ లిస్టింగ్ స్టార్టప్ కంపెనీ ‘జోమాతో’ నుంచి ఏడాది తిరక్కుండానే తప్పుకున్నారు. గతంలో లింక్డ్ఇన్ ఇండియాలో హెడ్‌గా పనిచేసిన నిశాంత్ రావు చెన్నైలో ఏర్పాటు చేసిన ‘ఫ్రెష్ డెస్క్’ స్టార్టప్ కంపెనీ నుంచి వారం కిందనే తప్పుకున్నారు. ఒకప్పుడు సిలికాన్ వ్యాలీలో ఒక వెలుగు వెలిగిన ఈ దిగ్గజాలు మాతృదేశంలోని కంపెనీల్లో ఎందుకు నిలదొక్కుకోలేక పోతున్నారు? వారు మరింత ఎక్కువ జీతాలకు ఆశపడి పోతున్నారా? కంపెనీ వాతావరణం నచ్చడం లేదా? ఇక్కడి పని సంస్కతికి అలవాటు పడలేకపోతున్నారా? మరేవైనా ఇతర కారణాలు ఉన్నాయా? అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో స్థానిక వ్యాపార కంపెనీలు మార్కెట్‌పైనా, వచ్చే లాభాలపైన ప్రధానంగా దష్టిని కేంద్రీకరిస్తే భారత్‌కు వచ్చే స్టార్టప్ కంపెనీలు అంకెల మీద, మార్కెట్లో వాటా మీద (లాభాలతో సంబంధం లేకుండా) దష్టిని కేంద్రీకరించడం ప్రాథమిక లోపమని బెంగళూరులోని ‘స్టాంటన్ చేజ్’ కంపెనీ మేనేజింగ్ పార్టనర్ కేఎన్ శ్రీపాద్ తెలిపారు. భారత్‌లో 30 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్నారని, వందకోట్ల మంది సెల్ఫోన్లను వాడుతున్నారన్న అంకెల ఆధారంగా మార్కెట్‌ను అంచనా వేస్తున్నారని ఆయన వివరించారు. సిలికాన్ వ్యాలీలో, భారత్‌లో బయటి నుంచి చూస్తే సజనాత్మకత ఒకటిగానే కనిపిస్తుందని, కానీ క్షేత స్థాయిలో తేడాలు ఉన్నాయని, ఆ తేడాల వల్లనే స్టార్టప్ కంపెనీల్లో ఎక్కువ మంది నిలదొక్కుకోలేక పోతున్నారని ‘హైడ్రిక్ అండ్ స్ట్రగుల్స్’ ఇంచార్జి పార్టనర్ వెంకట్ శాస్త్రీ తెలిపారు. వ్యాలీలో అనుభవజ్ఞులైన సీనియర్లు దొరికే వారని, వారి అనుభవం ఇక్కడి వారికి లేదని చెప్పారు. పైగా అక్కడి మార్కెట్ పరిణతి చెందినదని, ఏ రంగానికి ప్రాముఖ్యత ఉందో ఏ రంగాల్లో రాణించాలో మార్గనిర్దేశం చేసేవారు కూడా సిలికాన్ వ్యాలీలో ఎక్కువని ఆయన వివరించారు. ఇక్కడి కంపెనీల్లో వాతావరణం, అంటే ఉద్యోగుల మధ్య సఖ్యత, స్నేహభావం లేకపోవడం, పని సంస్కతి నచ్చక పోవడమే తాము భారత స్టార్టప్ కంపెనీల నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణమని తప్పుకుంటున్న నెట్ దిగ్గజాలు చెబుతున్నారు. అమెరికాలో టాలెంట్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకొని ఉద్యోగాలు ఇవ్వగా, భారత్‌లో బంధు, మిత్ర సంబంధాల కారణంగా అనర్హులు కూడా ఉద్యోగాలు పొందుతున్నారని, వారి వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. సిలికాన్ వ్యాలీలో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వరకు పని వేళలు ఉంటాయని, వారాంతంలో రెండు రోజులు సెలవులు ఉంటాయని, భారత్‌లో పనివేళలు ఎక్కువ కావడమే కాకుండా ఎక్కువ వరకు విదేశీ కస్టమర్ల కోసం రాత్రిళ్లు పనిచేయాల్సి వస్తోందని, స్టార్టప్ కంపెనీలవడం వల్ల కూడా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటోందని వారన్నారు. భారత్‌లో రెడ్ టేపిజం కూడా ఎక్కువగానే ఉందన్నారు. వివిధ రంగాల్లో ఏర్పాటు చేయాల్సిందిపోయి కొన్ని రంగాల్లోనే ఎక్కువ స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేయడం కూడా భారత్‌లో జరుగుతున్న పొరపాటని, దాని వల్ల కంపెనీల మధ్య అనవసరమైన పోటీ పెరిగి మూసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయని మార్కెట్ వర్గాలు తెలియజేస్తున్నాయి. -
అచ్చం అలాంటివే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘మిర్చి’ సినిమాలో.. క్రీమ్ కలర్ ప్యాంట్ మీద వైట్ షర్ట్‌ను టక్ చేసిన హీరో ప్రభాష్ డ్రెస్ ఉంది రా బాబూ.. సూపర్’’ ‘‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాలో.. వైట్ కలర్ చీర మీద పసుపు రంగు బార్డర్, మెడలో తెల్లని హారంతో హీరోయిన్ దీపికా పడుకొనే వేసుకున్న డ్రెస్ చూడ్డానికి రెండు కళ్లు సరిపోలేదే..’’ ఇలా సినిమాల్లో మనకు నచ్చిన హీరో, హీరోయిన్లు వేసుకున్న డ్రెస్‌లు చూసి కామెంట్ చేసుకోవటం కొత్తేమీ కాదు. అచ్చం అలాంటివే వేసుకోవాలనిపిస్తుంది కూడా. కానీ ఏం లాభం! అవి దొరుకుతాయా? ఎక్కడ కొనాలో తెలియక మిన్నకుండి పోతాం. కానీ, ఐఐటీ-హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్న కుర్రకారు అలా ఊరుకోలేదు. తమ అభిమాన హీరోల గురించే కాదు. ఎదుటి వారి అభిమానాన్ని కూడా తీర్చేందుకు రంగం సిద్ధం చేశారు. తమ చదువులకు సాంకేతికతను జోడించి ఠీఠీఠీ.ఛ్చిఞ్ఛౌ.ఛిౌఝ వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఇదీ ఆ వెబ్సైట్ కథ! అనంతపురం జిల్లాకు చెందిన చిన్మయి రాజు, గుంటూరు జిల్లాకు చెందిన మామిడి రాజ రూపొందించిన ఈ వెబ్సైట్లో మన అభిమాన హీరో, హీరోయిన్లు ఆయా సినిమాల్లో వేసుకున్న డ్రెస్సులు, చీరలు, షూ, చెప్పులు.. ఇలా ప్రతీదీ కొనుగోలు చేయవచ్చు. అసలు దీనికెలా రూపకల్పన జరిగిందని అడిగితే... ‘ఈగ’తోనే అంతా మొదలైందని చెబుతారు వాళ్లిద్దరూ. ‘‘ఓ రోజు మా ఫ్యామిలీ అంతా కలసి ‘ఈగ’ సినిమాకు వెళ్లాం. ఆ సినిమాలో సమంత వేసుకున్న టాప్ చూసి నాకూ అలాంటిది కావాలని మా చెల్లి నన్నడిగింది. దానికోసం హైదరాబాద్‌లో చాలా షాపింగ్ చేశా. ఈ-కామర్స్ వెబ్సైట్లలోనూ వెతికినా దొరకలేదు. దానికి కాస్త దగ్గర్లో ఉన్న టాప్ దొరికింది. కానీ ఏదో వెలితి. ‘అరె.. మనకు కావాల్సిన డ్రెస్సు డబ్బులు పెట్టి కొందామన్నా దొరకదా?’ అనిపించింది. వెంటనే మా స్నేహితుడితో చర్చించా. ఏడాదిపాటు వెబ్సైట్ రూపకల్పనకు శ్రమించాం. ఏప్రిల్ 2013లో ఠీఠీఠీ.ఛ్చిఞ్ఛౌ.ఛిౌఝ వెబ్‌సైట్‌ను ప్రారంభించాం. డోర్ డెలి వరీకి వీలుగా జబాంగ్, ఫ్లిప్‌కార్ట్, ఫ్యాషన్ఎరా వంటి 36 ఈ-కామర్స్ వెబ్సైట్లతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ప్రస్తుతం మా కంపెనీలో ఆరుగురు పనిచేస్తున్నారు’’ అని రాజు వివరించారు. ఎలా కొనాలి? వెబ్‌సైట్‌కు లాగిన్ కాగానే మనకు టాలీవుడ్, బాలీవుడ్ సినీ తారలు ఫొటోలు డిస్ప్లే అవుతాయి. అభిమాన సినీ తార ఫొటో మీద క్లిక్ చేయగానే వెంటనే మీ వివరాలను అడుగుతారు. అవి పూర్తి చేయగానే మీరు క్లిక్ చేసిన సినీ తారల తాలూకు డ్రెస్సులు, యాక్సెసరీలు ప్రత్యక్షమవుతాయి. వాటి మీద క్లిక్ చేస్తే చాలు కోరుకున్న డ్రెస్సులు, యాక్సెసరీలు ఇంటికొచ్చేస్తాయి. షర్టుల నుంచి గోళ్ల పెయింట్ల వరకు..: టాలీవుడ్, బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు ఆయా చిత్రాల్లో వేసుకున్న షర్టులు, జీన్స్, టై, షూ, చెప్పులు, పర్సులు, గాజులు, చెవి రింగులు, గోళ్ల రంగులు, చేతి బ్యాండ్లు, ఆభరణాలు.. ఇలా ప్రతీది ఛ్చిఞ్ఛౌ వెబ్సైట్లో కొనుగోలు చేయవచ్చు. మరి డబ్బులెలా కట్టాలి..: ఛ్చిఞ్ఛౌ.ఛిౌఝలో నచ్చిన డెస్సులు, యాక్సెసరీలను ఆర్డర్ చేశాక ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా డబ్బులు కట్టొచ్చు. లేకపోతే మీ చిరునామాకు సంబంధిత వెబ్సైట్ నిర్వాహకులు మీరు ఆర్డర్ చేసిన డ్రెస్సులు, యాక్ససరీలు తీసుకొచ్చాక నేరుగా చేతికి డబ్బులు కట్టే సదుపాయం కూడా ఉంది. 36 ఈ-కామర్స్ వెబ్సైట్లతో..: ఈ వెబ్సైట్ నిర్వాహకులు ఆన్లైన్ వ్యాపారాన్ని ఎలా చేస్తారంటే.. ముందుగా ఛ్చిఞ్ఛౌ.ఛిౌఝ వెబ్సైట్లో మనకు నచ్చిన డ్రెస్సులను ఆర్డర్ చేస్తాం. దాన్ని అందుకున్న నిర్వాహకులు తాము ఒప్పందం కుదుర్చుకున్న 36 ఈ-కామర్స్ వెబ్సైట్లకు ఈ ఆర్డర్లను పంపిస్తారు. దీంతో మనం ఆర్డర్ చేసిన డెస్సులు ఆయా వెబ్సైట్ నిర్వాహకులు మన ఇంటికి పంపిస్తారు. త్వరలోనే వెండితెర, బుల్లితెరలోకి కూడా.. ఇప్పటివరకు ఛ్చిఞ్ఛౌ.ఛిౌఝ వెబ్సైట్లో మనకు నచ్చిన అభిమాన హీరో, హీరోయిన్లు వేసుకున్న డ్రెస్సులు, యాక్ససరీలను పోలినవి, లేక వాటికి దగ్గరగా ఉన్నవి మాత్రమే కొనుగోలు చేసే అవకాశముంది. అయితే, కొందరు సినీ నిర్మాతలు తమ సినిమాల్లోని హీరోలు, హీరోయిన్లు వేసుకునే డ్రెస్సులు, యాక్సెసరీలను ఈ వెబ్సైట్ ద్వారా విక్రయించమని అడిగారని‘సాక్షి’తో చిన్మయి రాజు చెప్పారు. ‘అందుకే ఏప్రిల్ నుంచి సినిమాలో హీరోలు, హీరోయిన్లు వేసుకున్న డ్రెస్సుల్ని నేరుగా విక్రయించే వ్యాపారాన్ని కూడా ప్రారంభిస్తున్నాం. మార్చి నుంచి సీరియళ్లలోని నటీనటులు వేసుకునే డ్రెస్సులు, యాక్సెసరీలను విక్రయించడం కూడా మొదలు పెడుతున్నాం’’ అని తెలియజేశారు.