గ్రీస్ ఫెయిర్ కోసం సంస్థల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్: గ్రీస్‌లో ని తెసాలోనికిలో సె ప్టెంబర్ 5-13 దాకా జరగబోయే అంతర్జాతీయ ఫెయిర్‌లో పాల్గొనేందుకు ఆసక్తిగల లఘు, చిన్న, మధ్య తరహా సం స్థలు (ఎంఎస్‌ఎంఈ) దరఖాస్తులు పంపాల్సిందిగా ఎంఎస్‌ఎం ఈ-డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్ కోరింది. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీవో) దీన్ని నిర్వహిస్తోంది. ఎంపికైన సంస్థలకు స్పేస్ రెంటు, విమాన చార్జీలు మొదలైన వాటి కోసం గరిష్టంగా రూ.1.25 లక్షల మేర సబ్సిడీ లభిస్తుందన్నారు.