వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికా రిజర్వు, ఫెడ్ వడ్డీరేట్లను పెంచుతుందో లేదో తెలియక సతమతమైన రూపాయికి ఊరట లభించింది. ఫెడ్ రేట్లలో ఎలాంటి మార్పు లేదని ఫెడరల్ రిజర్వు ఓపెన్ మార్కెట్ కమిటీ ప్రకటించటంతో రూపాయి 2 పైసలు బలపడింది. ప్రపంచ ప్రధాన కరెన్సీల కంటే అమెరికా కరెన్సీ తక్కువగా నమోదవుతోంది. ఉద్యోగాల నియామకాల వృద్ధి మందగించడంతో రేట్లను పెంచడం లేదని కమిటీ బుధవారం తెలిపింది. అయితే రేట్ల పెంపు ఎప్పుడు చేపడుతోందో కమిటీ వెల్లడించలేదు. వాషింగ్టన్ లో జరిగిన నాలుగవ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్ఓఎమ్ సీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
మొత్తంగా ఆర్థికవ్యవస్థ వృద్ధి కొనసాగుతున్నప్పటికీ, ఉద్యోగాల వృద్ధి తక్కువగా నమోదైందని కమిటీ పేర్కొంది. ఈ నేపథ్యంలో వడ్డీరేట్ల పెంపు చేపట్టకపోవడమే మంచిదని ప్రకటించింది. ఈ ఏడాది వడ్డీరేట్ల పెంపు రెండు సార్లు ఉండవచ్చని కమిటీ సభ్యులు సూత్రపాయంగా అంచనావేస్తున్నప్పటికీ.. వాస్తవ పరిస్థితుల బట్టి చూస్తే కేవలం ఒక్క సారి మాత్రమే పెంపు చేపట్టవచ్చని అభిప్రాయం పడుతున్నారు.లేబర్ మార్కెట్ మందగించడంపై పాలసీ మేకర్స్ ఆందోళన వ్యక్తంచేశారు. మరోవైపు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా పాలసీ నిర్ణయాన్ని ప్రభావితం చేశాయని ఫెడ్ గవర్నర్ జానెట్ యెల్లెన్ పేర్కొన్నారు. వడ్డీ రేట్లు పెంచకపోవడానికి ఈ నిర్ణయం కూడా ఒక ప్రధాన కారణంగా ఉందని యెల్లెన్ ప్రకటించారు. యూరోపియన్ యూనియన్లో కొనసాగడమా..వైదొలగడమా.. అనే నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు.
యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగేందుకు వచ్చే వారం బ్రిటన్ చేపడుతున్న ఓటింగ్ కూడా ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఒకవేళ జూలైలో జాబ్ మార్కెట్ పునరుద్ధరించుకుంటే ఆ నెలలో ఫెడ్ రేట్లను పెంచే అవకాశాలున్నట్టు ఆర్థికనిపులంటున్నారు. అయితే వడ్డీరేట్ల పెంపుకు ఆర్థిక పరిమాణాలపై ఓ స్పష్టమైన అభిప్రాయం రావాల్సి ఉందని కమిటీ తెలిపింది.
ఫెడ్ ప్రకటనతో బలపడుతున్న రూపాయి
Published Thu, Jun 16 2016 11:12 AM | Last Updated on Mon, Oct 1 2018 5:32 PM
Advertisement
Advertisement