
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంక్ నికర లాభం (స్డాండోలోన్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 43 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2016–17) క్యూ4లో రూ.257 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.145 కోట్లకు తగ్గిందని ఫెడరల్ బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో క్షీణించిందని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.2,598 కోట్ల నుంచి రూ.2,862 కోట్లకు పెరిగింది.