సాక్షి,ముంబై: దాదాపు 100పాయింట్లకుపైగా నష్టాలతో నీరసంగా ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు భారీలాభాలతో ముగిశాయి. మిడ్ సెషన్ నుంచి కీలక సూచీలు లాభాల యూటర్న్ తీసుకున్నాయి. బ్యాంకింగ్ సెక్టార్లో ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సెన్సెక్స్ కనిష్టం నుంచి దాదాపు 600 పాయింట్లు పుంజుకుంది.చివరికి సెన్సెక్స్ 347 పాయింట్లు జంప్‌చేసి 36652 వద్ద, నిఫ్టీ 100 పాయింట్లు ఎగిసి 11,067 వద్ద స్థిరంగా ముగిసింది. రియల్టీ స్వల్పంగా నష్టపోగా, మిగిలిన అన్ని రంగాలూ బలపడ్డాయి. ఫార్మా, బ్యాంక్ నిఫ్టీ, ఆటో, ఐటీ రంగాలు లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు, సన్ ఫార్మా, సన్ ఫార్మా, టైటన్, లుపిన్, టెక్ మహీంద్రా, మారుతి, బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, ఏషియన్ పెయింట్స్ టాప్ విన్నర్స్‌గానూ, ఐబీ హౌసింగ్ దాదాపు 6 శాతం పతనంకాగా, భారతి ఎయిర్‌టెల్ , ఎస్‌బ్యాంకు, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, గెయిల్, ఇన్‌ఫ్రాటెల్, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ టాప్ లూజర్స్‌గానూ నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment