సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్పంగా కోలుకున్నాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో ఇంట్రాడేలో 600 పాయింట్లకు పతనమై 572 పాయింట్ల నష్టంతో 35,312 వద్ద సెన్సెక్స్ స్థిరపడింది. అయితే అంతర్జాతీయంగా మార్కెట్లు రీబౌండ్ కావడంతో శుక్రవారం నాటి ట్రేడింగ్ ఆరంభంలోనే ఈ భారీ పతనంనుంచి స్వల్ప మద్దతు లభించింది. అనంతరం మరింత పుంజుకుని సెన్సెక్స్ 155 పాయింట్లు ఎగిసి 35.467వద్ద, నిఫ్టీ 35 పాయింట్లు లాభపడి 10,636 వద్ద కొనసాగుతోంది.
ఐటీ తప్ప మిగిలిన రంగాలన్నీ లాభపడుతున్నాయి. రియల్టీ టాప్ గెయినర్‌గా ఉంది. ఎస్‌బ్యాంక్, వేదాంతా లాభపడుతుండా, టెక్ మహీంద్ర, తాజా ఒప్పందంతో ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్ కౌంటర్ నష్టపోతోంది.
మరోవైపు చమురు, డాలరు బలహీనత నేపథ్యంలో దేశీయ కరెన్సీ రూపాయి బలంగా ప్రారంభమైంది. 35 పైసలు లాభంతో 70.55 వద్ద ట్రేడ్ అవుతోంది. గురువారం 70.99 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment