Relief rally
-
యుద్ధ భయాల నుంచి కోలుకున్న మార్కెట్
ముంబై: ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధ భయాల నుంచి దలాల్ స్ట్రీట్ తేరుకుంది. షార్ట్ కవరింగ్ కొనుగోళ్లతో మంగళవారం సూచీలు దాదాపు ఒకశాతం లాభపడ్డాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న రికవరీ ర్యాలీ కలిసొచ్చింది. క్రూడాయిల్ ధరలు గరిష్ట స్థాయిల నుంచి దిగివచ్చాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్ఎఫ్) తాజాగా 2024 ఆర్థిక సంవత్సరానికి గానూ భారత వృద్ధి రేటును 20 బేసిస్ పాయింట్లు పెంచి 6.3 శాతానికి పెంచింది. ఫలితంగా ఫైనాన్స్, బ్యాంకింగ్, ఆటో, ఐటీ షేర్లలో నెలకొన్న కొనుగోళ్లతో సెన్సెక్స్ 567 పాయింట్లు పెరిగి 66,079 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 177 పాయింట్లు బలపడి 19,690 వద్ద నిలిచింది. ఒకదశలో సెన్సెక్స్ 668 పాయింట్లు బలపడి 66,180 వద్ద, నిఫ్టీ 206 పాయింట్లు దూసుకెళ్లి 19,718 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. ఇటీవల అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్న చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆస్తకి చూపారు. ఫెడ్ రిజర్వ్ అధికారుల సరళతర ద్రవ్య విధాన అమలు వ్యాఖ్యలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు... ఇజ్రాయెల్‌లోని హైఫా పోర్ట్‌లో పనిచేస్తున్న తమ ఉద్యోగుల భద్రతకు తగిన చర్యలు తీసుకున్నామని, ఉద్యోగులందరూ సురక్షితంగా ఉన్నారని అదానీ పోర్ట్స్, సెజ్ వివరణ ఇవ్వడంతో ఈ కంపెనీ షేరు 4% లాభపడి చేసి రూ.819 వద్ద స్థిరపడింది. పండుగ డిమాండ్‌తో సెప్టెంబర్ రిటైల్ అమ్మకాల్లో 20% వృద్ధి నమోదైనట్లు డీలర్ల సమాఖ్య ఫెడా ప్రకటనతో ఆటో షేర్లు దూసుకెళ్లాయి. టాటా మోటార్స్ 2%, ఎంఅండ్ఎం 1.50%, మారుతీ 1.32% లాభపడ్డాయి. అశోక్ లేలాండ్ 1.22%, హీరో మోటో 0.66%, బజాబ్ ఆటో 0.64%, ఐషర్ 0.42%, టీవీఎస్ 0.36% పెరిగాయి. -
లాభాల బాటలో స్టాక్‌మార్కెట్లు
ముంబై : స్టాక్‌మార్కెట్లు మంగళవారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య ప్రారంభమైనా కొనుగోళ్లు ఊపందుకోవడంతో భారీగా లాభపడుతున్నాయి. ఆరంభంలో భారీగా పతనమైన సూచీలు ప్రస్తుతం పాజిటివ్ జోన్లో కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ ప్రభావంతో కుదేలైన స్టాక్‌మార్కెట్లలో పుల్‌బ్యాక్ ర్యాలీ చోటుచేసుకుంది. మొత్తంమీద బీఎస్ఈ సెన్సెక్స్ 524 పాయింట్ల లాభంతో 31,911 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 154 పాయింట్లు పెరిగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 9352 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. చదవండి : మళ్లీ అదే వరస : కుప్పకూలిన సూచీలు -
తెప్పరిల్లిన స్టాక్‌మార్కెట్లు : సెంచరీ లాభాలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్పంగా కోలుకున్నాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో ఇంట్రాడేలో 600 పాయింట్లకు పతనమై 572 పాయింట్ల నష్టంతో 35,312 వద్ద సెన్సెక్స్ స్థిరపడింది. అయితే అంతర్జాతీయంగా మార్కెట్లు రీబౌండ్ కావడంతో శుక్రవారం నాటి ట్రేడింగ్ ఆరంభంలోనే ఈ భారీ పతనంనుంచి స్వల్ప మద్దతు లభించింది. అనంతరం మరింత పుంజుకుని సెన్సెక్స్ 155 పాయింట్లు ఎగిసి 35.467వద్ద, నిఫ్టీ 35 పాయింట్లు లాభపడి 10,636 వద్ద కొనసాగుతోంది. ఐటీ తప్ప మిగిలిన రంగాలన్నీ లాభపడుతున్నాయి. రియల్టీ టాప్ గెయినర్‌గా ఉంది. ఎస్‌బ్యాంక్, వేదాంతా లాభపడుతుండా, టెక్ మహీంద్ర, తాజా ఒప్పందంతో ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్ కౌంటర్ నష్టపోతోంది. మరోవైపు చమురు, డాలరు బలహీనత నేపథ్యంలో దేశీయ కరెన్సీ రూపాయి బలంగా ప్రారంభమైంది. 35 పైసలు లాభంతో 70.55 వద్ద ట్రేడ్ అవుతోంది. గురువారం 70.99 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. -
స్మార్ట్ రికవరీ : లాభాల ముగింపు
సాక్షి,ముంబై: దాదాపు 100పాయింట్లకుపైగా నష్టాలతో నీరసంగా ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు భారీలాభాలతో ముగిశాయి. మిడ్ సెషన్ నుంచి కీలక సూచీలు లాభాల యూటర్న్ తీసుకున్నాయి. బ్యాంకింగ్ సెక్టార్లో ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సెన్సెక్స్ కనిష్టం నుంచి దాదాపు 600 పాయింట్లు పుంజుకుంది.చివరికి సెన్సెక్స్ 347 పాయింట్లు జంప్‌చేసి 36652 వద్ద, నిఫ్టీ 100 పాయింట్లు ఎగిసి 11,067 వద్ద స్థిరంగా ముగిసింది. రియల్టీ స్వల్పంగా నష్టపోగా, మిగిలిన అన్ని రంగాలూ బలపడ్డాయి. ఫార్మా, బ్యాంక్ నిఫ్టీ, ఆటో, ఐటీ రంగాలు లాభపడ్డాయి. హెచ్డీఎఫ్సీ, కొటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు, సన్ ఫార్మా, సన్ ఫార్మా, టైటన్, లుపిన్, టెక్ మహీంద్రా, మారుతి, బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, ఏషియన్ పెయింట్స్ టాప్ విన్నర్స్‌గానూ, ఐబీ హౌసింగ్ దాదాపు 6 శాతం పతనంకాగా, భారతి ఎయిర్టెల్ , ఎస్‌బ్యాంకు, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, గెయిల్, ఇన్ఫ్రాటెల్, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ టాప్ లూజర్స్‌గానూ నిలిచాయి. -
కోలుకున్న స్టాక్ మార్కెట్..
లాభాలు-నష్టాలు-లాభాలు సెన్సెక్స్ 291 పాయింట్లు అప్ నిఫ్టీకి 72 పాయింట్లు లాభం సోమవారం భారీ పతనం తర్వాత మంగళవారం స్టాక్ మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ చోటు చేసుకుంది. జీఎస్టీ, ఇతర కీలక బిల్లుల ఆమోదం కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించడంతో స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 291 పాయింట్లు లాభపడి 26,032 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 72 పాయింట్లు లాభంతో 7,881 పాయింట్ల వద్ద ముగిశాయి. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 2,190 పాయింట్లు క్షీణించింది. షార్ట్ కవరింగ్ చోటు చేసుకోవడం, రూపాయి బలపడడం(55 పైసలు పెరిగి 66.10 వద్ద ముగిసింది), యూరోపియన్ మార్కెట్లు, అమెరికా ఫ్యూచర్స్ పుంజుకోవడం వంటి అంశాలూ ప్రభావం చూపాయి. ఆగస్టు సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో రెండు రోజుల్లో ముగియనుండటంతో ట్రేడింగ్ ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగింది. ఐటీ సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. రియల్టీ, బ్యాంక్, లోహ, చమురు, గ్యాస్, పీఎస్‌యూ, మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు లాభపడ్డాయి. తీవ్రంగా ఒడిదుడుకులు: సెన్సెక్స్ లాభాల్లో మొదలై, ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయి, మళ్లీ లాభాల బాట పట్టింది. సోమవారం ముగింపుతో పోల్చితే ఇంట్రాడేలో 383 పాయింట్లు లాభపడింది. ఒక దశలో 444 పాయింట్లు నష్టపోయింది. చైనా షాంఘై స్టాక్ సూచీ 7.6 శాతం పతనమవడం ప్రభావం చూపింది. ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో మొత్తం 827 పాయింట్ల రేంజ్లో కదలాడింది. 30 సెన్సెక్స్ షేర్లలో 22 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.4,805 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.27,646 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.4,93,405 కోట్లుగా నమోదైంది. కాగా ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. యూరోప్ మార్కెట్లు 3 నుంచి 5 శాతం శ్రేణిలో లాభపడ్డాయి. స్టాక్ మార్కెట్ అక్కడక్కడే!: బీఓఎఫ్ఏ భారత స్టాక్ మార్కెట్ సమీప భవిష్యత్తులో అక్కడక్కడే కదలాడుతుందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్(బీఓఎఫ్ఏ) మంగళవారం తెలిపింది. అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులు, కంపెనీల ఆర్థిక ఫలితాలు బలహీనంగా ఉండడం దీనికి కారణాలని తాజా నివేదికలో పేర్కొంది. రూ.1.5 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద మంగళవారం స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సంపద రూ.1.5 లక్షల కోట్లు పెరిగింది. సోమవారం సెన్సెక్స్ 1,625 పాయింట్ల పతనంతో రూ. 7 లక్షల కోట్ల సంపద ఆవిరైన విషయం తెలిసిందే. మంగళవారం ట్రేడింగ్ ముగిసిన తరవాత బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.96,51,311 కోట్లకు చేరింది. ఈ మార్కెట్ క్యాప్ సోమవారం 95.29 లక్షల కోట్లకు తగ్గింది. ఆల్‌టైమ్ హైకి అమరరాజా బ్యాటరీస్ అమర రాజా బ్యాటరీస్ బీఎస్ఈలో 15% లాభంతో జీవిత కాల గరిష్ట స్థాయి రూ.1,132ను తాకింది. కేవలం ఒక్క నెలలోనే ఈ షేర్ 34 శాతం పెరిగింది. ఈ ఏడాది జూలై 27న రూ.844గా ఉన్న ఈ షేర్ మంగళవారం 9.5 శాతం లాభంతో రూ.1,078 వద్ద ముగిసింది. కంపెనీ ఆర్థిక ఫలితాలు బాగా ఉండడం, బ్యాటరీల తయారీలో ఉపయోగించే సీసం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో షేర్ ధర జోరుగా పెరుగుతోందని నిపుణులంటున్నారు.