
న్యూఢిల్లీ: పండుగల సీజన్ నేపథ్యంలో ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ అక్టోబర్‌లో ’ది బిగ్ బిలియన్ డేస్’ (టీబీబీడీ) సేల్ ప్రారంభించనుంది. టీబీబీడీ అయిదో ఎడిషన్ అక్టోబర్ 10 నుంచి 14 దాకా ఉంటుందని సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్లు, టీవీలు, గృహోపకరణాలు, ఫర్నిచర్ మొదలైన వాటన్నింటిపై భారీ ఆఫర్లు ఉంటాయని సంస్థ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. వచ్చే నెల పండుగ సీజన్‌లో వివిధ ఈ–కామర్స్ సైట్లలో దాదాపు 2 కోట్ల మంది షాపింగ్ చేస్తారని అంచనాలు ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్ చేతికి ఇజ్రాయెల్ కంపెనీ..
ఇజ్రాయెల్‌కి చెందిన అప్‌స్ట్రీమ్ కామర్స్ సంస్థను కొనుగోలు చేసినట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అయితే ఇందుకోసం ఎంత వెచ్చించినదీ వెల్లడించలేదు. ఉత్పత్తులు.. వాటి ధరల విశ్లేషణ తదితర అంశాలకు సంబంధించి అప్‌స్ట్రీమ్ కామర్స్ క్లౌడ్ ఆధారిత సర్వీసులు అందిస్తోంది. తమ ప్లాట్‌ఫాంపై విక్రయించేవారికి మార్కెట్‌పై మరింత అవగాహన కల్పించేందుకు ఈ సంస్థ కొనుగోలు తోడ్పడుతుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment