ఉద్యోగులను తొలగించలేదు: ఫ్లిప్కార్ట్ | Flipkart denies laying off employees | Sakshi
Sakshi News home page

ఉద్యోగులను తొలగించలేదు: ఫ్లిప్కార్ట్

Jul 29 2016 5:59 PM | Updated on Aug 1 2018 3:40 PM

ఉద్యోగులను తొలగించలేదు: ఫ్లిప్కార్ట్ - Sakshi

ఉద్యోగులను తొలగించలేదు: ఫ్లిప్కార్ట్

పనితీరు బాగోని కారణంగా దాదాపు వెయ్యిమంది ఉద్యోగులను తాము తొలగించామంటూ వచ్చిన కథనాలను ఫ్లిప్కార్ట్ ఖండించింది.

పనితీరు బాగోని కారణంగా దాదాపు వెయ్యిమంది ఉద్యోగులను తాము తొలగించామంటూ వచ్చిన కథనాలను ఫ్లిప్కార్ట్ ఖండించింది. ఈ అంశం గురించి సంస్థ అధికార ప్రతినిధి స్పందించారు. చాలా సందర్భాలలో ఉద్యోగుల పనితీరు అంత బాగోదని, అలాంటప్పుడు వారి పనితీరు మెరుగుపరుచుకోడానికి సూచనలు ఇస్తామని చెప్పారు. కొంత కాలం తర్వాత కూడా వాళ్లు తగినంతగా మెరుగుపడని పక్షంలో వాళ‍్లకు కంపెనీ వె లుపల తమ నైపుణ్యాలను మెరుగ్గా ఉపయోగించుకునేచోట అవకాశాలు వెతుక్కునేందుకు ప్రోత్సహిస్తామన్నారు. తమ కంపెనీ పనితీరు ఆధారంగా నడుస్తుందని, అందువల్ల చాలా పారదర్శకమైన మదింపు ప్రక్రియను అనుసరిస్తామని ఓ ప్రకటనలో తెలిపారు.

ఫ్లిప్కార్ట్ ఆధ్వర్యంలోనే నడిచే మైంత్రా సంస్థ ఇటీవలే జబాంగ్ అనే మరో ఈటైలర్ను టేకోవర్ చేసింది. ఫ్యాషన్, లైఫ్స్టైల్ రంగాలలో తన మార్కెట్ను విస్తరించుకోడానికి రూ. 471 కోట్లతో ఈ టేకోవర్ ప్రక్రియను చేపట్టింది. 2014 మేలో మైంత్రాను ఫ్లిప్కార్ట్ దాదాపు రూ. 2వేల కోట్లతో కొనుగోలు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement