రూ.799కి ఫ్లిప్‌కార్ట్‌ కొత్త గాడ్జెట్‌ | Flipkart Launches new Power Banks Starting at Rs. 799 | Sakshi
Sakshi News home page

రూ.799కి ఫ్లిప్‌కార్ట్‌ కొత్త గాడ్జెట్‌

Published Sat, Feb 3 2018 9:00 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

Flipkart Launches new Power Banks Starting at Rs. 799 - Sakshi

ఫ్లిప్‌కార్ట్‌

దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ తన బిలియన్‌ బ్రాండ్‌ను విస్తరిస్తోంది. ఈ బ్రాండు కింద కొత్తగా రెండు పవర్‌ బ్యాంక్‌లను లాంచ్‌ చేసింది. ఒకటి 10000ఎంఏహెచ్‌ వెర్షన్‌ దీని ధర 799 రూపాయలు. రెండోది 15000ఎంఏహెచ్‌ కెపాసిటీ కలిగిన మోడల్‌. దీని ధర 999 రూపాయలు. ఈ రెండు మోడల్స్‌ మల్టిపుల్‌ యూఎస్‌బీ పోర్ట్స్‌ను కలిగి ఉన్నాయి. అన్ని యూఎస్‌బీ పోర్ట్స్‌కి కూడా 5వీ / 2.1ఏ పవర్‌ అవుట్‌పుట్‌ సామర్థ్యం ఉంది.  ''ఏ+ గ్రేడ్‌'' ''లిథియం-అయాన్‌'' బ్యాటరీస్‌తో ఇది రూపొందాయి. ఫ్లిప్‌కార్ట్‌ గతేడాది జూలైలో తన బిలియన్‌ బ్రాండును మార్కెట్‌లోకి లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ బ్రాండు కింద తొలి ప్రొడక్ట్‌గా బిలియన్‌ క్యాప్చర్‌+ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. 

ఈ రెండు పవర్‌ బ్యాంక్‌లు ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో బ్లాక్‌, కాపర్‌, రోజ్‌ గోల్డ్‌ కలర్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉండనున్నాయని కంపెనీ తెలిపింది.  ఈ పవర్‌ బ్యాంక్‌లకు ఎల్‌ఈడీ టార్చ్‌ కూడా ఉంది. ఏడు రకాల భద్రతాపరమైన ఫీచర్లతో బిలియన్‌ పవర్‌ బ్యాంక్‌లను తీసుకొచ్చినట్టు ఫ్లిప్‌కార్ట్‌ చెప్పింది. వాటిలో అండర్‌-ఓల్టేజీ, ఓవర్‌ ఓల్టేజీ ప్రొటెక్షన్‌, బిల్ట్‌-ఇన్‌ ప్రొటెక్షన్‌, షార్ట్‌-సర్క్యూట్‌ ప్రొటెక్షన్‌ ఉన్నాయి. టాప్‌-సెల్లింగ్‌ పవర్‌ బ్యాంక్‌ల కంటే 13 శాతం తేలికగా ఉన్నట్టు కూడా కంపెనీ తెలిపింది. 

డిజైన్‌ పరంగా రంగుల నుంచి కూడా భారతీయులు అభిరుచులకు అనుగుణంగా ఈ పవర్‌ బ్యాంక్‌లను వీటిని రూపొందించామని, భారతీయులు ఎక్కువగా రోజ్‌ గోల్డ్‌, కాపర్‌ కలర్స్‌ను ఇష్టపడతారని బిలియన్‌ కేటగిరీ హెడ్‌ హ్రిషికేష్ థైట్ తెలిపారు. ఈ పవర్‌ బ్యాంక్‌లకు ఏడాది పాటు ఇంటి వద్దనే సర్వీసు వారెంటీని కూడా కల్పిస్తోంది. ప్రస్తుతం వీటిని యాక్సిస్‌ బ్యాంకు బుజ్‌ క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేసే వారికి 5 శాతం డిస్కౌంట్‌ను కూడా ఆఫర్‌ చేయనున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. కాగ, ఎంఐ పవర్‌ బ్యాంక్‌ 2ఐ కూడా రూ.799కే లభ్యమవుతోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

ఫ్లిప్‌కార్ట్‌ బిలియన్‌ బ్రాండులో కొత్త పవర్‌ బ్యాంక్‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement