
సాక్షి, న్యూఢిల్లీ: 2015-20కిగాను ఫారిన్ ట్రేడ్ పాలసీ రివ్యూను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వస్తువులు, సేవల ఎగుమతులను పెంచడానికి, దేశంలో ఉపాధి అవకాశాలు, విలువలను పెంచుకోవడానికి, విధాన పరమైన చర్యలు చేపట్టే లక్ష్యంతో, విదేశీ వాణిజ్యం పాలసీ మధ్యంతర సమీక్ష మంగళవారం కేంద్రం విడుదల చేసింది. 2020 నాటికి సుమారు 900 బిలియన్ డాలర్ల మేర రెట్టింపు వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐదు సంవత్సరాల విదేశీ వాణిజ్య విధానంలో ఏప్రిల్ 2015 ప్రత్యేక ఆర్ధిక మండలాలలో ఎగుమతిదారులు , విభాగాలకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. దాదాపు రూ. 8,500 కోట్ల కొత్త ప్రోత్సాహకాలను ప్రకటించింది. ముఖ్యంగా మైక్రో, చిన్న, మధ్య తరహా పరిశ్రమల, కార్మిక-ఇంటెన్సివ్ విభాగాలు, వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టింది.
ఫారిన్ ట్రేడ్ డైరెక్టర్ జనరల్ అలోక్ చతుర్వేది మాట్లాడుతూ వ్యాపారాన్ని సులభతరం చేయనున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలో జీఎస్‌టీని గేమ్ చేంజర్ గా అభివర్ణించారు. వార్షిక ప్రోత్సాహకాలను 34శాతం పెంచి రూ.8,450కోట్లుగా నిర్ణయించామన్నారు. ఎఫ్‌టీపీ డైనమిక్ పత్రం.. దీని ద్వారా దేశంలో విలువలను పెంచుకోవడానికి, మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించడానికి , ఎగుమతులను పెంపు లక్ష్యంమని చెప్పారు.
వస్తువుల ఎగుమతుల కోసం రూ. 4,567 కోట్లు, సేవల ఎగుమతులు రూ. 1,140 కోట్ల ఇంటెన్సివ్‌లను అందించనుంది. ఇటీవల రెడీమేడ్ దుస్తులపై ప్రకటించిన ప్రోత్సాహకాలు ఇవి అదనం.డ్యూటీ-ఫ్రీ దిగుమతుల కోసం స్వీయ ధృవీకరణ పథకాన్ని ప్రకటించింది. జీఎస్‌టీ నెట్‌వర్క్ పరిధిలో ఈ గడువును 18నెలలకు 24 నెలలకు పొడిగించింది. మర్చండైస్ ఎగుమతుల యొక్క ప్రోత్సాహక రేట్లు ప్రతి ఒక్కరికి 2శాతం పెంచింది. తోలు మరియు పాదరక్షల కోసం రూ .749 కోట్లు, వ్యవసాయం, సంబంధిత వస్తువులకు రూ. 1354 కోట్లు, మెరైన్ ఎగుమతులకు రూ .759 కోట్లు, టెలికాం మరియు ఎలక్ట్రానిక్ వస్తువులకు రూ .369 కోట్లు, హ్యాండ్ మేడ్ కార్పెట్లకు 921 కోట్లు, మెడికల్ అండ్ సర్జికల్ పరికరాలకోసం రూ. 193 కోట్లు, వస్త్రాలకు , రెడీమేడ్ వస్త్రాలకు రూ .1140 కోట్లు కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment