4 ప్రాజెక్ట్లు.. 40 ఫ్లాట్లు! | four projects...40plots starts in february | Sakshi
Sakshi News home page

4 ప్రాజెక్ట్లు.. 40 ఫ్లాట్లు!

Published Fri, Oct 21 2016 10:33 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM

4 ప్రాజెక్ట్లు.. 40 ఫ్లాట్లు!

4 ప్రాజెక్ట్లు.. 40 ఫ్లాట్లు!

చిన్న చిన్న ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో శరవేగంగా కదులుతున్న రామ్ డెవలపర్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనూ నగరంలో పలు ప్రాజెక్ట్‌లకు...

ఫిబ్రవరిలో పలు ప్రాజెక్ట్‌లు ప్రారంభం
రామ్ డెవలపర్స్ ఎండీ రాము

 సాక్షి, హైదరాబాద్: చిన్న చిన్న ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో శరవేగంగా కదులుతున్న రామ్ డెవలపర్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనూ నగరంలో పలు ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టనుంది. పద్మారావ్ నగర్, బేగంపేట, ఎల్బీనగర్, నాగోల్‌లో ఈ ప్రాజెక్ట్‌లు రానున్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లు, కొత్త ప్రాజెక్ట్‌ల వివరాలను రామ్ డెవలపర్స్ ఎండీ రాము ‘సాక్షి రియల్టీ’తో పంచుకున్నారు.

పంజగుట్టలో శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్‌తో కలసి వెయ్యి గజాల్లో హిదర్ క్రెస్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఐదంతస్తుల్లో 15 ఫ్లాట్లొస్తాయి. 1,200-1,975 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ధర చ.అ.కు రూ.7,500. వచ్చే డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం.

చిక్కడపల్లిలో 500 గజాల్లో మై ఫెయిర్ అవెన్యూస్‌ను నిర్మిస్తున్నాం. ఐదంతస్తుల్లో మొత్తం 10 ఫ్లాట్లొస్తున్నాయి. 1,195- 1,470 చ.అ.ల్లో ఫ్లాట్లుంటాయి.ధర చ.అ.కు రూ.5,000. మూడు నెలల్లో పూర్తి చేస్తాం.

బేగంపేటలో 725 గజాల్లో రివర్‌స్టోన్ హ్యాబిటేట్‌ను నిర్మిస్తున్నాం. నాలుగంతస్తుల్లో 12 ఫ్లాట్లుంటాయి. 1,940-1,980 చ.అ. ఫ్లాట్లుంటాయి. ధర చ.అ.కు రూ.5,500. డిసెంబర్ 2017కు ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం.

వచ్చే ఏడాది జనవరిలో ఎల్బీనగర్‌లో 850 గజాల్లో రామ్ అవెన్స్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నాం. ఐదంతస్తుల్లో 15 ఫ్లాట్లుంటాయి. 1,180-1,800 చ.అ.ల్లో ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ధర చ.అ.కు రూ.3,500.

నాగోల్‌లో 500 గజాల్లో మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నాం. ఇందులో నాలుగంతస్తుల్లో 8 ఫ్లాట్లుంటాయి. 1,175-1,500 చ.అ. మధ్య ఫ్లాట్లుంటాయి. ధర చ.అ.కు రూ.3,200

పద్మారావ్‌నగర్‌లో 475 గజాల్లో రామ్ రెసిడెన్సీ రానుంది. నాలుగంతస్తుల్లో 8 ఫ్లాట్లుంటాయి. ధర చ.అ.కు రూ.6,000.

బేగంపేటలో 700 గజాల్లో రామ్ ఎన్‌క్లేవ్ ప్రాజెక్ట్‌ను చేయనున్నాం. ఇందులో నాలుగంతస్తుల్లో 8 ఫ్లాట్లుంటాయి. ఏడాదిన్నరలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement