
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా కొన్ని హోటళ్లు నాణ్యతలేని ఆహారపదార్థాలు విక్రయిస్తున్నాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఈ అంశంపై దృష్టి సారించింది. లైసెన్స్ లేని ఫుడ్ ఆపరేటర్స్ పేర్లను తమ ప్లాట్‌ఫామ్స్ నుంచి తప్పించాలని 10 ఈ–కామర్స్ సంస్థలను ఆదేశించింది. ఆదేశాలందుకున్న వాటిల్లో స్విగ్గీ, జొమాటో, ఫుడ్‌పాండా, ఉబెర్ ఈట్స్, ఫాసూస్, బాక్స్8 తదితర సంస్థలున్నాయి.
ఈ ఉత్తర్వులపై తీసుకున్న చర్యలను ఈ జూలై 31లోగా తెలియజేయాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పేర్కొంది. అలాగే ఈకామర్స్ సంస్థలు కూడా తమ లైసెన్సు వివరాలు, వివిధ ఆపరేటర్లతో కుదుర్చుకున్న ఒప్పందాలు మొదలైనవి కూడా సమర్పించాలని సూచించింది. ఈ–కామర్స్ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు సంబంధించి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఈ ఏడాది ఫిబ్రవరిలో మార్గదర్శకాలు రూపొందించింది.
Comments
Please login to add a commentAdd a comment