
సాక్షి, న్యూఢిల్లీ : బంగారం, వెండి ధరలు బుధవారం భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు 9 ఏళ్ల గరిష్టస్ధాయికి పెరగడంతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ఆల్‌టైం హైకి చేరుకుంది. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం ఏకంగా 500 రూపాయలు పెరిగి తొలిసారిగా రూ .50,026కు ఎగిసింది. బంగారం బాటలోనే దూసుకెళ్లిన వెండి ఒక్కరోజులోనే 3502 రూపాయలు పెరిగి ఏకంగా 60,844కు ఎగబాకింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరగడంతో పాటు అమెరికన్ డాలర్ బలహీనపడటంతో యల్లోమెటల్‌కు గిరాకీ పెరిగింది. ఆర్థిక వ్యవస్థ ఉత్తేజానికి అమెరికాలో మరో భారీ ప్యాకేజ్ ప్రకటిస్తారనే అంచనాలు కూడా హాట్‌మెటల్స్‌కు డిమాండ్ పెంచాయి. అనిశ్చిత పరిస్థితుల్లో ద్రవ్యోల్బణానికి దీటుగా సురక్షిత రిటన్స్ అందిస్తాయనే నమ్మకంతో మదుపరులు బంగారం, వెండివంటి విలువైన లోహాల్లో పెట్టుబడులు పెడుతున్నారని నిపుణులుపేర్కొంటున్నారు. చదవండి : గోల్డ్‌మేన్.. మూతికి బంగారు మాస్కు
Comments
Please login to add a commentAdd a comment