సాక్షి, ముంబై: ఫెడ్ వడ్డీ రేటు పెంపు అంచనాలు, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ‍్యంలో బంగారం, వెండిధరలు సోమవారం పతనాన్ని నమోదు చేశాయి. ఆరంభం నష్టాలనుంచి మరింత నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో ఏప్రిల్ నెల డెలివరీ పుత్తడి ధర 0.18 శాతం పడిపోయింది. ప్రస్తుతం10 గ్రాముల బంగారం ధర రూ.120 క్షీణించి 30,104 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా, జూన్ నెలలో డెలివరీ గోల్డ్‌ధర ధర 42 రూపాయలు లేదా 0.14శాతానికిపై గా పడిపోయింది. మరో విలువైన మెటల్ వెండి ధరలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి.
విదేశాలలో బలహీనమైన ధోరణితో పుత్తడి ధరల కిందిగి పడ్డాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డాలర్ స్థిరంగా ఉండటంతో, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందని పెట్టుబడిదారులు అంచనా వేశారు. దీంతో ఎంసీఎక్స్ మార్కెట్‌లో అమ్మకాలు వెల్లువ సాగుతోంది. ఇది బంగారం ధరలను ప్రభావితం చేసిందని బులియన్ ట్రేడర్లు తెలిపారు.
అటు 24 క్యారెట్ల పుత్తడి ధరలు రూ.32 వేలకు దిగువనకు చేరాయి. హైదరాబాద్‌లో 22 క్యారట్ల బంగారం ధర రూ. 28,950గాను, 24క్యారెట్ల ధర పది గ్రా. రూ. 30,960లు పలుకుతోంది. ఢిల్లీలో 22 క్యారట్ల బంగారం ధర రూ.29,500 గాను, 24క్యారెట్ల ధర 31,600గాను ఉంది. కిలో వెండి ధర రూ. 130లు(0.35) నష్టపోయి 38, 228 వద్ద ఉంది. ఇక అంతర్జాతీయంగా సింగపూర్‌లో ఔన్స్ బంగారం ధర 0.17 శాతం తగ్గి 1,311.40 డాలర్లకు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment