దేశీయ ఎంసీఎక్స్ మార్కెట్లో పసిడి ఫ్యూచర్స్ ధర మంగళవారం స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. ఆగస్ట్ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర గం.9:40ని.లకు రూ.16 నష్టపోయి రూ.46085 వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్నరాత్రి ఎంసీఎక్స్ మార్కెట్‌లో రూ. 46101 వద్ద ముగిసింది. ఆర్థిక వ్యవస్థపై ఆశావహన అంచనాలతో ఇన్వెస్టర్లు రిస్క్ అసెట్స్‌గా భావించే ఈక్విటీల్లో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నాయి. ఫలితంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్ తగ్గుతోంది. ఈ క్రమంలో గత నెల గరిష్ట స్థాయి రూ.48,000 నుంచి పసిడి ఏకంగా రూ.2000 వరకు నష్టాన్ని చవిచూసింది.
నేటి ట్రేడింగ్ సెషన్‌లో పసిడి ఫ్యూచర్లు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని బులియన్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేడు ఎంసీఎక్స్ పసిడి ధర రూ.45,800- రూ.46,330 శ్రేణిలో కదలాడే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలను పరిశీలిస్తే.., ఆసియాలో ఉదయం ట్రేడింగ్ సెషన్‌లో ఆగస్ట్ కాంటాక్టు ఔన్స్ పసిడి ధర 5డాలర్ల నష్టంతో 1,700 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో పెట్టుబడులకు మొగ్గుచూపడంతో పసిడి ఫ్యూచర్లకు డిమాండ్ తగ్గినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఫెడ్ సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత పసిడి ప్రతికూలాంశంగా మారింది. భారత వర్తమాన కాల ప్రకారం నేటి రాత్రి అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం ప్రారంభం కానుంది. వడ్డీరేట్లపై కీలక నిర్ణయాన్ని బుధవారం ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో పసిడి ఇన్వెసర్లు, ట్రేడర్లు వడ్డీరేట్లపై ఫెడ్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాయి. సాధారణంగా వడ్డీరేట్లు పెరిగితే పసిడి తగ్గుతుంది.
Comments
Please login to add a commentAdd a comment