Gold future
-
బంగారంపై పెట్టుబడి పెట్టిన వారింట లాభాల పంట
న్యూయార్క్/న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఈక్విటీల నుంచి బంగారంలోకి వేగంగా మళ్లిస్తున్నారు. దీంతో యల్లో మెటల్ అంతర్జాతీయ మార్కెట్, దీనికి అనుగుణంగా దేశీయ మార్కెట్లో మెరిసిపోతోంది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సేంజీలో ఔన్స్ (31.1 గ్రాములు) ధర మంగళవారం క్రితం ముగింపుతో పోల్చితే 72 డాలర్ల లాభంతో (3.6 శాతం) 2,068 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కరోనా తర్వాత కరోనా తీవ్రత నేపథ్యంలో 2020 ఆగస్టులో 2,121 డాలర్లకు చేరి... 2,063 స్థాయిలో ముగిసింది. అయితే మహమ్మారి సవాళ్లు తగ్గుముఖం పడుతున్న కొద్దీ గత ఏడాది నవంబర్ నాటికి 1,680 డాలర్ల వరకూ దిగివచ్చింది. ఈ స్థాయి వద్ద కొనుగోళ్ల మద్దతుతో తిరిగి దాదాపు 1,800 డాలర్ల స్థాయికి ఎగసింది. అటు తర్వాత ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తదనంతర పరిణామాలు తిరిగి పసిడికి మెరుపును తీసుకువచ్చింది. రూపాయి విలువ అంతర్జాతీయ పరిణామాలకు తోడు దేశీయంగా రూపాయి కనిష్ట స్థాయిలకు పడిపోవడంతో బంగారం 10 గ్రాముల ధర భారత్ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్ంజీలో 2022 మార్చి 8 రాత్రి 11 గంటల సమయంలో రూ.2,000 లాభంతో రూ.55,500 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో రూ.55,650 స్థాయిని కూడా చూసింది. దేశీయ స్పాట్ మార్కెట్లో బుధవారం ధర రూ.2,000 వరకూ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
పసిడి ఫ్యూచర్లు: 2రోజూ నేలచూపులే..!
దేశీయ బులియన్ మార్కెట్లో పసిడి ఫ్యూచర్ల ధర వరుసగా 2రోజూ నేలచూపులు చూస్తోంది. ఎంసీఎక్స్ మార్కెట్లో సోమవారం ఉదయం ఆగస్ట్ కాంటాక్టు 10గ్రాములు పసిడి ధర రూ.360 నష్టపోయి రూ.46,974 వద్ద ట్రేడ్ అవుతోంది. గతవారంలో ఎంసీఎక్స్ మార్కెట్లో పసిడి ధర 2శాతం లాభపడి రూ.47,334 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. ఈక్విటీ మార్కెట్ల అనిశ్చితి పరిస్థితుల్లో ‘‘పతనమైన ప్రతిసారి కొనుగోలు’’ వ్యూహాన్ని అమలు చేసుకోవచ్చని బులియన్ పండితులు చెబుతున్నారు. పసిడి ఫ్యూచర్ల ధర రూ.47,550లను అధిగమించగలిగితే రూ.47,800-48,000 శ్రేణిలో కదలాడే అవకాశం ఉందని వారు చెప్పుకొచ్చారు. ఈ 2020 ఇప్పటి వరకు పసిడి 20శాతం ర్యాలీ చేయగా, గతేడాది కాలంగా 25శాతం లాభపడింది. అంతర్జాతీయ మార్కెట్లో 10డాలర్ల పతనం: ఇక అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్ల ధర ఏకంగా 10డాలర్లు నష్టాన్ని చవిచూసింది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్ పసిడి ధర 10డాలర్ల క్షీణించి 1,737.30 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. కోవిడ్-19 వైరస్ వ్యాధి రెండో దశ వ్యాప్తి భయాలతో రక్షణాత్మక సాధనమైన పసిడికి ప్యూచర్లకు డిమాండ్ పెరగడంతో గతవారంలో 2.5శాతం లాభపడి 1737 డాలర్ల వద్ద స్థిరపడింది. ‘‘అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అధ్వాన పరిస్థితుల్లో ఉంది. కోవిడ్-19 వైరస్ వ్యాధి రెండో దశ వ్యాప్తి మొదలైంది. పలు సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లు తగ్గించాయి. ఈ పరిస్థితులన్నీ పసిడికి కలిసొచ్చేవే. పసిడి తిరిగి ర్యాలీ అని అందుకుంటుంది.’’ అని యాక్సికార్ప్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ఛీఫ్ మార్కెట్ వ్యూహకర్త స్టీఫెన్ తెలిపారు. -
పసిడి ఫ్యూచర్లలో లాభాల స్వీకరణ
దేశీయ పసిడి ఫ్యూచర్లలో శుక్రవారం లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా నేటి ఉదయం సెషన్లో 10గ్రాములు పసిడి ధర రూ.350ల నష్టాన్ని చవిచూసింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి పరిమిత శ్రేణిలో ట్రేడ్ అవుతుండటం కూడా పసిడి ఫ్యూచర్ల విక్రయాలకు కొంత కారణమైంది. ఉదయం 10గంటకు ఆగస్ట్ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర నిన్నటి ముగింపు(రూ.47414)తో పోలిస్తే రూ.265లు నష్టపోయి రూ.47140 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయంగా పసిడి ధర వారం గరిష్టానికి తాకడం, ఈక్విటీల్లో భారీ పతనంతో ఇన్వెస్టర్ల రక్షణాత్మక సాధనమైన పసిడి కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీంతో నిన్నరాత్రి ఎంసీఎక్స్ మార్కెట్ ముగిసే సరికి రూ.788 లాభపడి రూ. 47414 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా పరిమిత శ్రేణిలో: అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్స్ ధర పరిమిత శ్రేణిలో ట్రేడ్ అవుతోంది. పసిడి ధరను ప్రభావితం చేసే డాలర్ బలపడటం ఇందుకు కారణమవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్ పసిడి ఫ్యూచర్స్ ధర 4డాలర్లు క్షీణించి 1735డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇటీవల రోజుల్లో పసిడి ఫ్యూచర్లు చెప్పుకొదగిన ర్యాలీ చేసిన నేపథ్యంలో కొంతమేర లాభాల స్వీకరణకు జరిగినట్లు బులియన్ పండితులు చెబుతున్నారు. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లను కనిష్టస్థాయిలో యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించడంతో నిన్నటి ట్రేడింగ్ వారం గరిష్టాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మార్చి నెల మధ్యలో పసిడి ధర 3నెలల కనిష్టాన్ని తాకిన నాటి నుంచి పసిడి ధర 20శాతం ర్యాలీ చేసింది. -
స్వల్ప నష్టాల్లో పసిడి
దేశీయ ఎంసీఎక్స్ మార్కెట్లో పసిడి ఫ్యూచర్స్ ధర మంగళవారం స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. ఆగస్ట్ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర గం.9:40ని.లకు రూ.16 నష్టపోయి రూ.46085 వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్నరాత్రి ఎంసీఎక్స్ మార్కెట్లో రూ. 46101 వద్ద ముగిసింది. ఆర్థిక వ్యవస్థపై ఆశావహన అంచనాలతో ఇన్వెస్టర్లు రిస్క్ అసెట్స్‌గా భావించే ఈక్విటీల్లో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నాయి. ఫలితంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్ తగ్గుతోంది. ఈ క్రమంలో గత నెల గరిష్ట స్థాయి రూ.48,000 నుంచి పసిడి ఏకంగా రూ.2000 వరకు నష్టాన్ని చవిచూసింది. నేటి ట్రేడింగ్ సెషన్లో పసిడి ఫ్యూచర్లు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని బులియన్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేడు ఎంసీఎక్స్ పసిడి ధర రూ.45,800- రూ.46,330 శ్రేణిలో కదలాడే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలను పరిశీలిస్తే.., ఆసియాలో ఉదయం ట్రేడింగ్ సెషన్లో ఆగస్ట్ కాంటాక్టు ఔన్స్ పసిడి ధర 5డాలర్ల నష్టంతో 1,700 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో పెట్టుబడులకు మొగ్గుచూపడంతో పసిడి ఫ్యూచర్లకు డిమాండ్ తగ్గినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఫెడ్ సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత పసిడి ప్రతికూలాంశంగా మారింది. భారత వర్తమాన కాల ప్రకారం నేటి రాత్రి అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం ప్రారంభం కానుంది. వడ్డీరేట్లపై కీలక నిర్ణయాన్ని బుధవారం ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో పసిడి ఇన్వెసర్లు, ట్రేడర్లు వడ్డీరేట్లపై ఫెడ్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాయి. సాధారణంగా వడ్డీరేట్లు పెరిగితే పసిడి తగ్గుతుంది. -
భవిష్యత్తుపై భరోసా పెంచుకోండి
ఉచితంగా మళ్లీ పోలీసు శిక్షణ ఇప్పిస్తాం టీఆర్‌ఎస్‌రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి మెదక్: మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కలలు నెరవేర్చండి...బంగారు భవిష్యత్తు కోసం పునాదులు వేసుకోండి...మీ అందరినీ ఖాకీ దుస్తుల్లో చూడాలన్నదే..మా ఏకైక లక్ష్యం మరోసారి ఉచితంగా శిక్షణ ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నామని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఇటీవల ఎస్ఐ, కానిస్టేబుల్ శిక్షణలో అర్హత సాధించిన అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని నిరుద్యోగులు అత్యధికంగా పోలీస్ శాఖలో ఉద్యోగాలు సంపాదించాలనే ఉద్దేశంతో మాధవరెడ్డి చారిటబుల్ ట్రస్టు పేరిట ఉచితంగా శిక్షణ ఇప్పించామన్నారు. ఈయేడు ఫిబ్రవరి 20నుంచి ఏప్రిల్ 1 వరకు అభ్యర్థులకు హైదరాబాద్ నుంచి శిక్షకులను పిలిపించి 580మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణతోపాటు మధ్యాహ్న భోజనం, బుక్స్ అందజేశామన్నారు. అందులో 150మంది అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించగా, ఈవెంట్స్‌లో 60మంది అర్హత సాధించారన్నారు. వీరిలో ఆరుగురు ఎస్ఐ అభ్యర్థులు కాగా, 54మంది కానిస్టేబుల్ అర్హత సాధించినట్లు తెలిపారు. ఈవెంట్స్‌లలో అర్హత సాధించిన వారంతా ఖాకీ యూనిఫాం వేసుకున్నప్పుడే తల్లిదండ్రుల కల, మా లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఇందుకోసం మరోరెండు నెలల వరకు అభ్యర్థులకు ఉచిత శిక్షణతోపాటు మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తామన్నారు. పేరు నిలబెడతాం గత ఫిబ్రవరి నుంచి ఉచిత శిక్షణ ఇవ్వడంతో ప్రిలిమినరీ పరీక్షలతోపాటు ఈవెంట్స్‌లో రాణించాం. మేము ప్రైవేట్‌గా శిక్షణ తీసుకుంటే ఆర్థికంగా చాలా ఖర్చయ్యేది. ఇక్కడ శిక్షణ తీసుకున్నందునే మేము ఇంత వరకు రాణించగలిగాం. ఉద్యోగాలు సాధించి ట్రస్టు పేరు నిలబెడతాం. సురేష్, ఎస్ఐ అభ్యర్థి, కొంటూర్ ఉద్యోగం సాధించి తీరుతాం మేము అడగకుండానే రూ. లక్షలు వెచ్చించి మా భవిష్యత్తు కోసం ఉచిత శిక్షణ, మధ్యాహ్న భోజనం, బుక్స్ అందజేశారు. మాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించి తీరుతాం. కె. రాణి, కానిస్టేబుల్ అభ్యర్థిని, మక్తభూపతిపూర్ డిప్యూటీ స్పీకర్ దంపతులకు రుణపడి ఉంటాం మా భవిష్యత్తు కోసం డిప్యూటీ స్పీకర్ దంపతులు ఉచితంగా శిక్షణ ఇప్పించడంతో పరీక్షల్లో, ఈవెంట్స్‌లో నెగ్గాం. మాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదివి ఫైనల్స్‌లో కూడా విజయం సాధిస్తాం. మాకు ఇంతటి చేయుతనిస్తున్న డిప్యూటీ స్పీకర్ దంపతులకు రుణపడి ఉంటాం. సరిత, కానిస్టేబుల్ అభ్యర్థిని, బి.భూపతిపూర్ -
పిల్లలకు బీమాతోనే ధీమా..!
చదువు నుంచి అత్యవసరం దాకా చైల్డ్ప్లాన్లు పిల్లల బంగారు భవిష్యత్‌కు బాటలు వేయడానికి పెట్టుబడి సాధనాలు చాలా ఉన్నాయి. కానీ జీవిత బీమా కంపెనీలందించే చైల్డ్ ప్లాన్ల ఆకర్షణే వేరు. నిర్దిష్ట లక్ష్యం దిశగా ఒక క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేయడానికి ఇవి దోహదపడతాయి. వీటిలో ఉండే మరికొన్ని విశిష్టతలేమిటంటే.. నిరాటంకంగా చదువుకు తోడ్పాటు.. లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీ కూడా తోడయ్యే చైల్డ్ ప్లాన్ల వల్ల పాలసీదారున్నా, లేకున్నా.. పిల్లల భవిష్యత్ గురించి ఆందోళన చెందనక్కర్లేదు. అవసరమైతే పిల్లలకు కూడా బీమా కవరేజీని పెంచుకోవచ్చు. కావాలంటే వైకల్యం, క్రిటికల్ ఇల్నెస్, ప్రీమియం రద్దు వంటి రైడర్లు కూడా తీసుకుంటే మరింత భద్రత లభించినట్లవుతుంది. చైల్డ్ ప్లాన్లతో పిల్లలకు లభించే ప్రయోజనాల గురించి తెలుసుకుంటే.. సహజంగానే వాటిల్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచన కలుగుతుంది. తద్వారా క్రమశిక్షణతో పెట్టుబడి కొనసాగించి, పిల్లలకు అవసరమయ్యే నాటికి చెప్పుకోతగ్గ మొత్తాన్ని కూడబెట్టవచ్చు. పెద్ద మొత్తానికి దీర్ఘకాలిక పెట్టుబడే కీలకం.. పిల్లల విదేశీ చదువులు కావొచ్చు.. వివాహ శుభకార్యాలు కావొచ్చు.. ప్రస్తుతం అన్నీ భారీ ఖర్చులతోనే ముడిపడి ఉంటున్నాయి. రోజు రోజుకు పెరిగిపోయే ఫీజులను చూస్తుంటే రాబోయే సంవత్సరాల్లో ఏ స్థాయిలో కట్టాల్సి వస్తుందో అర్థమవుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత ముందు నుంచీ, వీలైనంత వరకూ క్రమపద్ధతిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెడితేనే పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవడం సాధ్యమవుతుంది. ఈక్విటీల్లో దీర్ఘకాలం.. అంటేపదేళ్లు పైగా పెట్టుబడులు పెడుతూ వెడితే, స్థిరమైన రాబడి అందించే సాధనాలకన్నా మెరుగైన రాబడులే వస్తాయని గణాంకాలు చెబుతున్నాయి. భవిష్యత్‌లోనూ ఇదే ధోరణి ఉండొచ్చని చెప్పడానికి లేదు కానీ.. 2014 డిసెంబర్ దాకా బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ ఏటా సుమారు 15.29 శాతం రాబడులు అందించింది. అత్యవసర పరిస్థితుల కోసం.. పిల్లల చదువులు, భవిష్యత్ అవసరాల కోసం చైల్డ్ ప్లాన్ రూపంలో లైఫ్ కవరేజీ కూడా ఉన్నప్పుడు.. అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేకంగా మళ్లీ భారీ మొత్తాల్ని పక్కన పెట్టుకోవాల్సిన అవసరం కాస్త తగ్గుతుంది. ఎమర్జెన్సీ పరిస్థితుల కోసం స్వల్పకాలిక ఫిక్సిడ్ డిపాజిట్లు, లిక్విడ్ ఫండ్స్ వంటి సాధనాల్లో చిన్న చిన్న మొత్తాలను ఇన్వెస్ట్ చేసి ఉంచుకోవచ్చు. దీనివల్ల రిటైర్మెంట్ వంటి మరింత పెద్ద లక్ష్యాల పెట్టుబడుల కోసం అధిక మొత్తం కేటాయించడం సాధ్యపడుతుంది. క్రమపద్ధతిలో పెట్టుబడి సౌలభ్యం.. ఇతరత్రా బీమా పథకాల తరహాలోనే ప్రీమియం చెల్లింపునకు సంబంధించి చైల్డ్ ప్లాన్లలో కూడా నెలవారీగా, మూడు నెలలకోసారి లేదా ఏడాదికోసారి కట్టే వెసులు బాటు ఉంటుంది. వేతనజీవులైతే నెలవారీ ఆప్షన్ ఎంచుకుంటే సులువుగా కట్టుకుంటూ వెళ్లొచ్చు. అదే ప్రతీ నెలా స్థిరమైన ఆదాయం ఉండని వ్యాపారస్తుల్లాంటి వాళ్లు వార్షిక విధానాన్ని ఎంచుకుంటే.. ఒక క్రమ పద్ధతిలో బ్యాంకు రికరింగ్ డిపాజిట్‌ను ప్రారంభించి, మెచ్యూర్ అయిన మొత్తాన్ని ప్రీమియం చెల్లింపునకు ఉపయోగించవచ్చు. ఇక ప్రీమియం చెల్లించడానికి కూడా పలు మార్గాలు ఉన్నాయి. ప్రీమియం చెల్లింపు తేదీ నాటికి మన బ్యాంకు ఖాతా నుంచి సదరు మొత్తం డెబిట్ అయ్యేలా ఈసీఎస్, ఆటో డెబిట్ వంటి మార్గాలను ఎంచుకోవచ్చు. క్రెడిట్ కార్డు వాడుతుంటే కార్డు కంపెనీకి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వొచ్చు. లాకిన్ వ్యవధి ప్రయోజనం.. చైల్డ్ ప్లాన్లు కూడా మిగతా జీవిత బీమా పథకాల్లానే దీర్ఘకాలిక పెట్టుబడి ధోరణులను అలవరిచేవే. ఎందుకంటే ఎంత ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేసి ఉంటే.. అంత ఎక్కువ రాబడులు వచ్చే అవకాశాలుంటాయి. సంప్రదాయ ప్లాన్లయితే 2-3 ఏళ్లు, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు (యులిప్స్) అయితే అయిదేళ్ల దాకా లాకిన్ వ్యవధి ఉంటుంది. కనీసం కొన్నాళ్ల పాటైనా పెట్టుబడిని కొనసాగించేలా చేసేందుకు ఈ నిబంధన పెట్టడం జరిగింది. ఒకవేళ ముందుగా వైదొలగాలంటే ఎంతో కొంత పెనాల్టీ కింద వదులుకోవాల్సి వస్తుంది. స్థూలంగా చెప్పాలంటే .. పిల్లల భవిష్యత్‌కు ఎటువంటి సమస్యలు ఉండకుండా భద్రతనివ్వాలనుకునే వారు ఎంచుకోతగిన సాధనాల్లో చైల్డ్ ప్లాన్లు చాలా కీలకమైనవనడంలో సందేహం లేదు.