క్రిమినల్‌ చర్యల నుంచి వ్యాపారాలకు ఊరట | Government to de-criminalise Income Tax Act | Sakshi
Sakshi News home page

క్రిమినల్‌ చర్యల నుంచి వ్యాపారాలకు ఊరట

Published Tue, Jan 21 2020 6:04 AM | Last Updated on Tue, Jan 21 2020 6:04 AM

Government to de-criminalise Income Tax Act - Sakshi

చెన్నై: ప్రతీ సంస్థనూ అనుమానించే విధంగా చట్టాలు ఉండకూడదన్నదే తమ ప్రభుత్వ అభిమతమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగానే కంపెనీల చట్టంలో వ్యాపార సంస్థలపై క్రిమినల్‌ చర్యలు సూచించే నిబంధనలన్నింటినీ సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలన్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో ప్రభుత్వం, వ్యాపారవర్గాల మధ్య విశ్వసనీయత పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నానీ పాల్కీవాలా స్మారకోపన్యాసం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు.  నిజాయితీగా పన్ను చెల్లించేవారికి వేధింపులు ఉండరాదన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement