నీరవ్ మోదీ(పైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : అతిపెద్ద బ్యాంకింగ్‌స్కాం పీఎన్‌బీ (పంజాబ్ నేషనల్ బ్యాంకు) కుంభకోణం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగుతోంది.. భారీ ఎత్తున బ్యాంకుల నుంచిరుణాలను తీసుకొని విదేశాలకు చెక్కేస్తున్న ఘరానాబాబులకు చెక్ పెట్టేలా కఠిన చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో బ్యాంకు మోసాలకు పాల్పడేవారు దేశం విడిచి వెళ్లిపోకుండా ఆంక్షలు తీసుకురావాలని యోచిస్తోంది.
గతంలో జరిగిన తప్పులు మళ్లీ రిపీట్ కాకూడదనే యోచనలోనే బ్యాంకులకు భారీగా బకాయి బడిన, అక్రమాలకు పాల్పడిన వారికి సంబంధించి ఒక భారీ జాబితాను కూడా తయారుచేసినట్టు సమాచారం. బ్యాంకు రుణాలు ఎగవేయడంతోపాటు, మోసపూరిత లావాదేవీలకు పాల్పడిన కేసుల్లో నిందితులు లేదా ఆ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నారట. పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ అధికారి ఈ విషయాలను వెల్లడించారు. ఇలాంటి కేసులకు సంబంధించి మొత్తం 400 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదార్లను గుర్తించిందని తెలిపారు. వీరిలో దాదాపు 91 మంది ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల లిస్ట్‌ను తయారు చేసినట్టు వెల్లడించారు. అంతేకాదు వీరు దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందట. అయితే దీనిపై ఆర్థికశాఖ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
కాగా వేలకోట్ల రూపాయల ఎగ్గొట్టిన విదేశాలకు పారిపోయిన విజయ్‌మాల్యాను తిరిగి దేశానికి రప్పించేందుకు కేంద్రచేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికీ ఫలింతచలేదు. దీనికితోడు ఇటీవలి వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ, మెహుల్ చోక్సీ, రొటోమ్యాక్ కుంభకోణాలు ప్రకంపనలు రేపాయి. ఈ నేపథ్యంలో రూ. 50కోట్లకు పైబడి బ్యాంకు రుణాలు పొందాలంటే ఆ ఖాతాదారులు పాస్‌పోర్టు వివరాలను అందించడం తప్పనిసరని ఇటీవల ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment