సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా-చైనా ట్రేడ్‌వార్, రోజు రోజుకూ క్షీణిస్తున్న రూపాయి విలువ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా అమెరికా, చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో విదేశీ వస్తువుల దిగుమతులను అడ్డుకునేందుకు కొన్నివస్తువులపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచాలనే ప్రతిపాదను పరిశీలిస్తోంది. ముఖ్యంగా విలువైన మెటల్ బంగారంపై ఈ పెంపు ఉండవచ్చని ఎనలిస్టులు అంచనావేశారు. అయితే ఇపుడు దీనికి భిన్నంగా బంగారాన్ని దిగుమతి సుంకం పెంపు నించి మినహాయింపునిస్తున్నట్టు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం బంగారంపై కుండా విలువైన రాళ్లను, కొన్ని రకాల ఉక్కు, ఎలక్ర్టానిక్ వస్తువులపై దిగుమతి సుంకం వేయాలని కేంద్ర నిర్ణయించింది. అక్రమ రవాణాను నివారించడానికి బంగారంను ఈ పెంపు నుంచి మినహాయించనున్నాని ఆర్థిక శాఖ అధికారి సోమవారం విలేకరులకు చెప్పారు. వీటితో పాటు విలువైన రాళ్ళపై కూడా ఈ పన్ను విధించే అవకాశముందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ అధికారి ఒకరు తెలిపారు. జాబితా తయారవుతోందని, త్వరలోనే తుది రూపం ఇచ్చి విడుదల చేస్తామని ఈ వర్గాలు తెలిపాయి.
డాలర్‌తో రూపాయి విలువ పడిపోతున్న నేపథ్యంలో కొన్ని రకాల వస్తువులు అంటే నిత్యావసరం కాని విలువౌన వస్తువులపై దిగుమతి సుంకం వేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇదే సమయంలో బంగారంపై కూడా సుంకం వేయాలని ప్రతిపాదనను పరిశీలించింది. మరోవైపు చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ఈరోజు(సెప్టెంబరు 24, 2018) నుంచి అమెరికా సుంకం అమలువుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment