పీఎస్‌యూ బీమా ఐపీవోలతో 15వేల కోట్లు | Govt may raise over Rs 15000 crore from IPO of 2 general insurers | Sakshi
Sakshi News home page

పీఎస్‌యూ బీమా ఐపీవోలతో 15వేల కోట్లు

Published Mon, Sep 18 2017 1:38 AM | Last Updated on Tue, Sep 19 2017 4:41 PM

పీఎస్‌యూ బీమా ఐపీవోలతో 15వేల కోట్లు

పీఎస్‌యూ బీమా ఐపీవోలతో 15వేల కోట్లు

సర్కారుకు సమకూరనున్న ఆదాయం
న్యూఢిల్లీ:
ప్రభుత్వ రంగంలోని రెండు సాధారణ బీమా కంపెనీల ఐపీవోల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.15,000 కోట్ల మేర నిధులు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వరంగంలోని ఐదు సాధారణ బీమా కంపెనీల్లో న్యూ ఇండియా అష్యూరెన్స్, జీఐసీ రానున్న కొన్ని వారాల్లో ఐపీవోకు రానున్నాయి.

పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఈ రెండు ఐపీవోల ద్వారా రూ.11,000 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే, ప్రస్తుత మార్కెట్‌ సానుకూల పరిస్థితుల నేపథ్యంలో ఖజానాకు రూ.15,000 కోట్ల వరకు నిధులు సులభంగా సమకూరే అవకాశం ఉందనేది మార్చంట్‌ బ్యాంకర్ల అభిప్రాయం. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.72,500 కోట్లను సమీకరించాలన్నది కేంద్ర సర్కారు లక్ష్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement