న్యూఢిల్లీ: ఆన్‌లైన్ బీమా ప్లాట్‌ఫామ్ పాలసీబజార్ మాతృ సంస్థ పీబీ ఫిన్‌టెక్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఐపీవోలో భాగంగా రూ. 3,750 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. దీనికి జతగా మరో రూ. 2,268 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 6,018 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. క్రెడిట్ ప్రొడక్టులను పోల్చి చూపే పోర్టల్ పైసాబజార్‌ను సైతం కంపెనీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఐపీవో చేపట్టేందుకు పాలసీబజార్ ఆగస్ట్‌లో సెబీకి దరఖాస్తు చేసింది. ఐపీవో చేపట్టే ముందు ప్రయివేట్ ప్లేస్‌మెంట్ ద్వారా రూ. 750 కోట్లను సమకూర్చుకోనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. తాజా ఈక్విటీ జారీ నిధులను కంపెనీ బ్రాండ్ల ప్రాచుర్యం, బిజినెస్ విస్తరణ తదితరాలకు వినియోగించనున్నట్లు తెలియజేసింది.
చదవండి: ఐపీవో.. ఓయోకి భారీ ఝలక్!
Comments
Please login to add a commentAdd a comment