అమెరికా సంస్థతో గ్రాన్యూల్స్ జట్టు | Granules acquires rights for 4 products from US pharma Windlas | Sakshi
Sakshi News home page

అమెరికా సంస్థతో గ్రాన్యూల్స్ జట్టు

Published Fri, Jun 10 2016 1:21 AM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM

అమెరికా సంస్థతో గ్రాన్యూల్స్ జట్టు

అమెరికా సంస్థతో గ్రాన్యూల్స్ జట్టు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికా మార్కెట్లో విక్రయాల కోసం యూఎస్‌ఫార్మా విండ్‌లాస్ సంస్థ నుంచి నాలుగు ఉత్పత్తులకు సంబంధించి హక్కులు దక్కించుకున్నట్లు గ్రాన్యూల్స్ ఇండియా వెల్లడించింది. డ్రోన్‌డరోన్, లూరాసిడోన్, ప్రాసుగ్రెల్, ఫింగ్లిమోడ్ వీటిలో ఉన్నట్లు వివరించింది. తమ అనుబంధ సంస్థ గ్రాన్యూల్స్ ఫార్మా (జీపీఐ) ద్వారా ఈ లావాదేవీ పూర్తి చేసినట్లు తెలిపింది. అమెరికాలో ఈ నాలుగు ఉత్పత్తుల వార్షిక అమ్మకాలు సుమారు 4.4 బిలియన్ డాలర్లుగా ఉంటాయి. విక్రయాల ద్వారా వచ్చే లాభాల్లో యూఎస్‌ఫార్మా విండ్‌లాస్‌కు వాటాలు, నిర్దిష్ట మైలురాళ్లను దాటిన అనంతరం ప్రత్యేకంగా చెల్లింపులు ఉంటాయి.  అమెరికా మార్కెట్లో స్థానం పటిష్టం చేసుకునే దిశగా ఈ తరహా దీర్ఘకాలిక భాగస్వామ్య వ్యూహాలను అమలు చేస్తున్నట్లు గ్రాన్యూల్స్ ఇండియా సీఎండీ కృష్ణప్రసాద్ చిగురుపాటి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement