వాషింగ్టన్ : అమెరికాలో హెచ్-వన్ బీ వీసాపై కఠినతరమైన చర్యలు అమలులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఆ దేశంలో పనిచేయడాకి అవకాశాలు కల్పించాలని కోరుతూ దాదాపు 2 లక్షల 50 వేల పిటిషన్లు భారత్ నుంచే వచ్చినట్టు ఆ ప్రభుత్వం ప్రకటించింది.వీటిలో చాలావరకూ భారత ఐటీ కంపెనీలే ఉండటం విశేషం. గతేడాది ఈ పిటిషన్లు 2 లక్షల 30 వేలు ఉంటే, ఈ ఏడాది అవి 2 లక్షల 50లుగా నమోదైనట్టు బిల్ స్టాక్, ఇన్ కమింగ్ ప్రెసిడెంట్ ఆప్ అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ తెలిపింది.కానీ ఈ పిటిషన్లలో కేవలం 85 వేల మందికే యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ హెచ్-వన్ బీ వీసాలను అందజేయనున్నట్టు పేర్కొన్నారు.
అమెరికన్ బిజినెస్, ఉద్యోగులను, ఆర్థిక వ్యవస్థను దష్టిలో ఉంచుకుని హెచ్-వన్ బీ వీసాలను సమీక్షించనున్నట్టు అధికారులు చెప్పారు. హెచ్-వన్ బీ వీసాల కేటగిరీలో కఠినమైన నిబంధనలు పెరుగుతున్న కొద్దీ భారత కంపెనీలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. చాలా భారత ఐటీ కంపెనీలు హెచ్-వన్ బీ వీసాలపైనే ఆధారపడి పనిచేస్తున్నారు. ఉద్యోగులను ప్రాజెక్టు పనిపై ఇక్కడికి పంపిస్తున్నారు. పిటిషనర్లకు సంబంధించిన పిటిషన్ ఫీజులను కూడా కంపెనీలే భరిస్తున్నాయి.