ఐఎస్‌బీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు చైర్మన్‌గా హరీష్‌ మన్వానీ | Harish Manwini as chairman of ISB Executive Board | Sakshi
Sakshi News home page

ఐఎస్‌బీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు చైర్మన్‌గా హరీష్‌ మన్వానీ

Published Sat, Jan 20 2018 12:09 AM | Last Updated on Sat, Jan 20 2018 12:09 AM

Harish Manwini as chairman of ISB Executive Board - Sakshi

హైదరాబాద్‌: ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) ఎగ్జిక్యూటివ్‌ బోర్డు కొత్త చైర్మన్‌గా హరీష్‌ మన్వాని ఎంపికయ్యారు. ఈయన ప్రస్తుతం హెచ్‌యూఎల్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా ఉన్నారు. శుక్రవారం ముంబయిలో ప్రస్తుత చైర్మన్‌ ఆది గోద్రేజ్‌ అధ్యక్షతన జరిగిన ఎగ్జిక్యూటివ్‌ బోరుడ సమావేశంలో మన్వానీ నియామకంపై నిర్ణయం తీసుకున్నారు.

ఈయన ఈ బాద్యతలను ఏప్రిల్‌లో స్వీకరిస్తారు. 2011 ఏప్రిల్‌ నుంచీ ఆది గోద్రేజ్‌ ఐఎస్‌బీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 42 దేశాలలో 8600 మంది ఐఎస్‌బీ పూర్వ విద్యార్థులు ఉన్నారని గోద్రేజ్‌ చెప్పారు. ఐఎస్‌బీకి గుర్తింపును ఇనుమడింపచేసేందుకు కృషిచేస్తాన ని మన్వానీ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement