ముంబై : దేశంలో అతిపెద్ద రుణ సంస్థ హౌజింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్‌డీఎఫ్‌సీ) ఐదేళ్లలో తొలిసారి తన గృహ రుణాల రేట్లను పెంచింది. 2013 డిసెంబర్ నుంచి తొలిసారి తమ బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును(పీఎల్‌ఆర్) పెంచుతున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ ప్రకటించింది. రూ.30 లక్షలకు పైనున్న రుణాల రేట్లను 20 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నామని, అదేవిధంగా రూ.30 లక్షలు తక్కువున్న ప్రాధాన్యత రంగ రుణాలపై 5 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది.
ఈ పెంపుకు ముందు హెచ్‌డీఎఫ్‌సీ పీఎల్‌ఆర్ 16.15 శాతంగా ఉంది. ప్రస్తుత పెంపుతో పీఎల్‌ఆర్ 16.35 శాతానికి పెరిగింది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంచిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షల మధ్యనున్న రుణాల రేట్లు 8.40 శాతం నుంచి 8.60 శాతానికి పెరగనున్నాయి. రూ.75 లక్షలకు పైనున్ను రుణాల రేట్లు 8.50 శాతం నుంచి 8.70 శాత... రూ.30 లక్షల వరకున్న రేట్లు 8.40 శాతం నుంచి 8.45 శాతానికి ఎగియనున్నాయి. అయితే మహిళా రుణ గ్రహీతలకు అన్ని శ్లాబులపై కూడా 5 బేసిస్ పాయింట్లు మాత్రమే పెరగనున్నాయి. ఈ పీఎల్‌ఆర్ పెంపుతో తమ మార్జిన్లను 2.20 శాతం నుంచి 2.35 శాతం రేంజ్‌లో కొనసాగించేందుకు సాయపడుతుందని హెచ్‌డీఎఫ్‌సీ సీఈవో కేకి మిస్త్రీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment