హెచ్డీఎఫ్సీ లాభం 27% వృద్ధి | HDFC Q1 net up 38% to Rs 1871 cr on stake sale in insurance biz | Sakshi
Sakshi News home page

హెచ్డీఎఫ్సీ లాభం 27% వృద్ధి

Published Thu, Jul 28 2016 1:02 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

హెచ్డీఎఫ్సీ లాభం 27% వృద్ధి

హెచ్డీఎఫ్సీ లాభం 27% వృద్ధి

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ జూన్ త్రైమాసికంలో రూ.2,796 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.2,204 కోట్లతో పోలిస్తే 26.86 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం ఆదాయం సైతం రూ.11,379 కోట్ల నుంచి రూ.13,517 కోట్లకు పెరిగింది. జనరల్ ఇన్సూరెన్స్ విభాగం హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గోలో వాటాల విక్రయం లాభాల వృద్ధికి తోడ్పడింది. స్టాండలోన్ ప్రకారం చూసినా కంపెనీ లాభం రూ.1,360 కోట్ల నుంచి రూ.1,870కోట్లకు పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌లో 22.9 శాతం వాటాకు సమానమైన 12.33 కోట్ల షేర్లను ఎర్గో ఇంటర్నేషనల్ ఏజీకి విక్రయించడం ద్వారా రూ.725 కోట్ల పన్ను అనంతర లాభాన్ని ఆర్జించినట్టు కంపెనీ తెలిపింది.

ఇలా వచ్చిన ఆదాయంలో రూ.275 కోట్లను స్టాండర్డ్ అసెట్స్‌పై కేటాయింపులకు, ఇతర ఖర్చులకు కేటాయించినట్టు పేర్కొంది. కాగా,  సమీక్షా కాలంలో నికర వడ్డీ మార్జిన్లు ఎలాంటి పురోగతి లేకుండా 3.8శాతంగానే ఉన్నాయి. ఇక కంపెనీ ఎన్‌పీఏలు రూ.0.75 శాతంగా ఉన్నాయి. గతేడాది ఇదే కాలంలో ఎన్‌పీఏల శాతం 0.69 శాతంతో పోలిస్తే స్వల్పంగా పెరిగినట్టు తెలుస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో మ్యాక్స్ లైఫ్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ల విలీన ఒప్పందం ప్రగతిపై హెచ్‌డీఎఫ్‌సీ వైస్ చైర్మన్ కేకి మిస్త్రీ స్పందించారు. జూన్ రెండో వారానికి విలీన నిర్మాణం, రేషియో ఖరారవుతుందని స్పష్టం చేశారు. కాగా,  సానుకూల ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ షేరు 1.48 శాతం పెరిగి రూ.1,387.85 వద్ద ముగిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement