హెచ్‌డీఎఫ్‌సీ లాభం 11% అప్ | HDFC standalone net profit rises | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ లాభం 11% అప్

Published Wed, May 7 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 7:00 AM

హెచ్‌డీఎఫ్‌సీ లాభం 11% అప్

హెచ్‌డీఎఫ్‌సీ లాభం 11% అప్

  • షేరుకి రూ. 14 డివిడెండ్
  • నికర వడ్డీ మార్జిన్లు 4.1%
  •  ముంబై: హౌసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ జనవరి-మార్చి(క్యూ4) కాలానికి రూ. 1,723 కోట్ల నికర లాభాన్ని సాధించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 1,555 కోట్లతో పోలిస్తే ఇది 11% వృద్ధి. ఇక ఆదాయం కూడా రూ. 5,666 కోట్ల నుంచి రూ. 6,620 కోట్లకు ఎగసింది. స్టాండెలోన్ ఫలితాలివి. వాటాదారులకు రూ. 2 ముఖ విలువగల షేరుకి రూ. 14 చొప్పున  డివిడెండ్ చెల్లించేందుకు కంపెనీ బోర్డు ప్రతిపాదించింది. క్యూ4లో వ్యక్తిగత విభాగంలో నికర మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 0.53%కాగా, ఇతర పోర్ట్‌ఫోలియోలలో 1.01%గా నమోదయ్యాయి. ఎన్‌పీఏగా పరిణమించిన హీరానందనీ ప్యాలస్(చెన్నై) విక్రయం ద్వారా రూ. 550 కోట్లను అందుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ క్వార్టర్‌లో రూ. 5,317 కోట్ల రుణాలను విక్రయించినట్లు వెల్లడించింది.
     
     పూర్తి ఏడాదికి: పూర్తి ఏడాదికి(2013-14) కంపెనీ నికర లాభం 12%పైగా పెరిగి రూ. 5,440 కోట్లను దాటింది. అంతక్రితం ఏడాది రూ. 4,848 కోట్లు నమోదైంది. ఈ బాటలో ఆదాయం సైతం రూ. 21,113 కోట్ల నుంచి రూ. 24,143 కోట్లకు పుంజుకుంది. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) 4.1%కాగా, రుణాలపై స్ప్రెడ్ 2.29%గా నమోదైంది. గత పదేళ్లగా వీటిని ఇదే స్థాయిలో నిలుపుకుంటూ వచ్చామని కంపెనీ వైస్‌చైర్మన్ కేకి మిస్త్రీ చెప్పారు. కాగా, మార్చి చివరికల్లా లోన్‌బుక్ రూ. 1,70,046 కోట్ల నుంచి రూ. 1,97,100 కోట్లకు పెరిగింది.  కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం  20% ఎగసి రూ. 7,948 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో షేరు 1% నష్టంతో రూ. 877 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement