ఐటీ గుప్పిట్లోకి డాక్టర్లు, లాయర్లు
ఐటీ గుప్పిట్లోకి డాక్టర్లు, లాయర్లు
Published Sat, May 13 2017 1:06 PM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM
ముంబై : పెద్ద నోట్ల రద్దు అనంతరం పెద్ద మొత్తంలో లావాదేవీలపై ఐటీ శాఖ జరుపుతున్న దాడులు తెలిసినవే. ఈ దాడుల్లో ప్రస్తుతం పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపిన లాయర్లు, డాక్టర్లు ఐటీ కనుసన్నల్లోకి వచ్చేశారు. బిజినెస్ లు, వివిధ ఫైనాన్సియల్ ఇన్ స్టిట్యూషన్స్, లాయర్లు, డాక్లర్లు, ఆర్కిటెక్ట్స్ వంటి ప్రొఫిషనల్స్ జరిపిన పెద్ద మొత్తంలో లావాదేవీల వివరాలను మే31 వరకు తమకు సమర్పించాలని వారి చార్టెడ్ అకౌంటెంట్లను, సీఎఫ్ఓలను ఐటీ ఆదేశించింది. నగదు డిపాజిట్, క్రెడిట్ కార్డు పేమెంట్స్, షేర్ల అమ్మకం, ప్రాపర్టీ డీల్స్, డిబెంచర్లు, మ్యూచవల్ ఫండ్స్ వంటి అన్ని ఎక్కువ విలువ లావాదేవీలను తెలుపాలని ఐటీ పేర్కొంది. అయితే జీతాలు ఆర్జించే వ్యక్తులు ఈ కొత్త స్టేట్ మెంట్ ఆఫ్ ఫైనాన్సియల్ ట్రాన్సాక్షన్స్(ఎస్ఎఫ్‌టీ) లో సమర్పించాల్సినవసరం లేదని తెలిపింది.
బ్యాంకులు, ప్రొఫిషల్స్, ఫారెక్స్ డీలర్స్, పోస్టు ఆఫీసులు, నిధీస్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ప్రాపర్టీ రిజిస్ట్రేటర్స్, బాండ్లు, డిబెంచర్లు, లిస్టెడ్ కంపెనీలు మాత్రమే ఎస్ఎఫ్‌టీ కింద రిపోర్టు చేయాల్సి ఉంటుందని చెప్పింది. ముందస్తున్న యాన్యువల్ ఇన్ ఫర్మేషన్ రిటర్న్(ఏఐఆర్) స్థానంలో ఈ ఎస్ఎఫ్‌టీ తీసుకొచ్చినట్టు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. బులియన్ డీలర్స్, స్టాక్ బ్రోకర్స్, ఆటోమొబైల్, లగ్జరీ గూడ్స్ డీలర్స్ కు దీనిపై అవగాహన కల్పించడానికి వర్క్ షాపులను కూడా నిర్వహిస్తున్నట్టు ఆదాయపు పన్ను శాఖ అదనపు డైరెక్టర్ అను క్రిష్ణ అగర్వాల్ తెలిపారు. ఆదాయపు పన్ను శాఖ 1961, సెక్షన్ 44ఏబీ కింద ఆడిట్ చేసే ప్రతి వ్యక్తి ఈ ఎస్ఎఫ్‌టీ రెగ్యులేషన్స్ కిందకు రానున్నారు. ఈ వివరాల్లో అవకతవకలుగా ఏదైనా సమాచారం ఉన్నట్టు తేలితే, 50వేల రూపాయల వరకు జరిమానా విధిస్తామని ఐటీ హెచ్చరించింది.
Advertisement