న్యూఢిల్లీ: దేశీ ప్రముఖ మొబైల్ మెసేజింగ్ యాప్ ‘హైక్ మెసెంజర్’ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య 10 కోట్ల మార్క్‌ను అధిగమించింది. గతేడాది ఆగస్ట్‌లో 2 వేల కోట్లగా ఉన్న నెలవారీ సందేశాల పరిమాణం ఇప్పుడు 4 వేల కోట్ల స్థాయికి పెరిగిందని కంపెనీ తెలిపింది. దీనర్థం యూజర్లు ఒక వారానికి 2 గంటలకు పైగా హైక్ యాప్‌ను ఉపయోగిస్తున్నారని పేర్కొంది. హైక్ మెసెంజర్‌లో సందేశాలు పంపించడం మాత్రమే కాకుండా వీడియో కాలింగ్ సౌలభ్యం, క్రికెట్ స్కోర్ వివరాలు తెలుసుకోవడం, ఆంగ్లం/హిందీ భాషల్లో వార్తలు చదువుకోవడం, ఫైల్ షేరింగ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.
హైక్ మెసెంజర్ యూజర్లు @: 10 కోట్లు
Published Fri, Jan 22 2016 2:54 AM | Last Updated on Sun, Sep 3 2017 4:03 PM
Advertisement
Advertisement