దేశీయ మెసేజింగ్ యాప్ హైక్ మెసెంజర్‌కు చెందిన హైక్ వాలెట్ లావాదేవీల్లో దూసుకుపోతుంది. ఈ వాలెట్ నెలకు కోటి లావాదేవీలను అధిగమించినట్టు హైక్ మెసెంజర్ గురువారం ప్రకటించింది. నెల నెలకు ఇది 100 శాతం వృద్ధిని నమోదుచేస్తున్నట్టు పేర్కొంది. ఈ కోటి లావాదేవీల్లో 70 శాతం రీఛార్జ్‌లు, మిగతా 30 శాతం పీర్-టూ-పీర్‌గా కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 2018 మొదటి క్వార్టర్లో హైక్ మరిన్ని సర్వీసులను అందించేందుకు చూస్తోంది. క్యాబ్ బుకింగ్, బస్సు, రైలు, మూవీ టిక్కెట్ల బుకింగ్, బిల్లుల చెల్లింపు వంటి సర్వీసులను యాడ్ చేయాలని యోచిస్తోంది.
'హైక్ వాలెట్ వృద్ధి గణనీయంగా ఉంది. ఈ వృద్ధికి అనుకూలంగా అప్‌డేటెడ్ డిజైన్‌ను మేము లాంచ్ చేశాం. హైక్‌పై సర్వీసులను తేలికగా గుర్తించి, లావాదేవీలు జరుపుకోవడానికి డిజైన్‌ను అప్‌డేట్ చేశాం. తమ యూజర్లకు మరిన్ని సర్వీసులు అందించాల్సి ఉంది. ఫ్లాట్‌ఫామ్‌పై ట్యాక్సీల బుకింగ్స్, మూవీ టిక్కెట్ల బుకింగ్ కోసం మేము ఎక్కువగా కృషిచేస్తున్నాం. వచ్చే క్వార్టర్ ప్రారంభంలోనే వీటిని ప్రారంభించనున్నాం'' అని హైక్ మెసెంజర్ సీఈవో, వ్యవస్థాపకుడు కవిన్ భారతి మిట్టల్ తెలిపారు.
ఈ నెల మొదట్లో గ్రూప్‌లకు సోషల్ ఫీచర్లను యాడ్ చేసింది. దీనిలో తొలి ఫీచర్.. ఓటు. ఈ ఫీచర్ ద్వారా గ్రూప్ చాట్‌లో యూజర్ పోల్‌ను పెట్టవచ్చు. తర్వాత ఫీచర్ బిల్ స్ప్లిట్. దీని ద్వారా గ్రూప్‌లో స్నేహితులు తమ బిల్లులను షేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా హైక్ వాలెట్ ద్వారా మనీని పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment