hike Messenger
-
ఉద్యోగులను తీసేస్తున్న హైక్ మెసేంజర్
న్యూఢిల్లీ : దేశీ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘హైక్’ కూడా ఉద్యోగాల కోత చేపడుతోంది. తన వర్క్‌ఫోర్స్‌లో 20 శాతం నుంచి 25 శాతం ఉద్యోగులను హైక్ మెసేంజర్ తీసివేయడం ప్రారంభించింది. హార్డ్‌వేర్ మేకర్ క్రియో, సోషల్ నెట్వర్కింగ్ వెంచర్ ఇన్‌స్టాలైవ్లీల కొనుగోళ్ల ప్రక్రియ పూర్తికావడంతో, ఈ ప్రభావం ఉద్యోగులపై పడుతోంది. ఎక్కువగా ఉన్న ఉద్యోగులను పనితీరు కారణంతో కంపెనీ తీసేస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు , దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతాల్లో 50 నుంచి 75 మంది ఉద్యోగులు ఈ పునర్నిర్మాణ బారిన పడే అవకాశముందని తెలుస్తోంది. లేఆఫ్స్ విషయాన్ని హైక్ మెసేంజర్ అధికార ప్రతినిధి కూడా ధృవీకరించారు. అయితే ఎంతమందిని తీసేస్తున్నారో మాత్రం అధికార ప్రతినిధి వెల్లడించలేదు. ‘గతేడాది తాము కొన్ని కొనుగోళ్లు చేపట్టాం. దాంతో ఉద్యోగుల సైజ్ స్కైరాకెట్‌లో దూసుకుపోయింది. కొన్ని టీమ్‌లను కలిపేయడం, క్రమబద్ధం చేయడం చేస్తున్నాం. వ్యాపారాలు యథావిథిగా సాగుతాయి’ అని కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. మానవ వనరుల విభాగం, అకౌంటింగ్, ఫైనాన్స్ వంటి వాటిల్లో ఈ లేఆఫ్స్ ప్రక్రియ ఉండనుంది. తీసివేసే ఉద్యోగులకు రెండు నెలల శాలరీతో కూడా సెవరెన్స్ ప్యాకేజీని కూడా కంపెనీ అందించనుందని సంబంధిత వర్గాలంటున్నాయి. క్రియోను హైక్ గతేడాది ఆగస్టులోనే తన సొంతం చేసుకుంది. ఆ కొనుగోలు ప్రకటన సమయంలో క్రియోలో 50 మంది ఉద్యోగులున్నారు. ఇన్‌స్టాలైవ్లీ ఆపరేట్ చేసే పల్స్ అనే నెట్వర్కింగ్ యాప్‌ను కూడా 2017 ఫిబ్రవరిలో కొనుగోలు చేసింది. ఈ డెవలప్మెంట్లు జరిగిన ఐదు నెలల్లోనే ఢిల్లీ చెందిన హైక్ మెసేంజర్, కొత్త మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను లాంచ్ చేసింది. డేటాను వాడకుండా మెసేజింగ్, రీఛార్జ్ చేసుకునే సర్వీసులను ఇది అందిస్తోంది. వాట్సాప్‌కు పోటీగా, లో ఎండ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను టార్గెట్ చేసుకుని ఈ సర్వీసులను హైక్ మెసేంజర్ ఆఫర్ చేస్తోంది. -
నెలకు కోటి లావాదేవీలు..
దేశీయ మెసేజింగ్ యాప్ హైక్ మెసెంజర్‌కు చెందిన హైక్ వాలెట్ లావాదేవీల్లో దూసుకుపోతుంది. ఈ వాలెట్ నెలకు కోటి లావాదేవీలను అధిగమించినట్టు హైక్ మెసెంజర్ గురువారం ప్రకటించింది. నెల నెలకు ఇది 100 శాతం వృద్ధిని నమోదుచేస్తున్నట్టు పేర్కొంది. ఈ కోటి లావాదేవీల్లో 70 శాతం రీఛార్జ్‌లు, మిగతా 30 శాతం పీర్-టూ-పీర్‌గా కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 2018 మొదటి క్వార్టర్లో హైక్ మరిన్ని సర్వీసులను అందించేందుకు చూస్తోంది. క్యాబ్ బుకింగ్, బస్సు, రైలు, మూవీ టిక్కెట్ల బుకింగ్, బిల్లుల చెల్లింపు వంటి సర్వీసులను యాడ్ చేయాలని యోచిస్తోంది. 'హైక్ వాలెట్ వృద్ధి గణనీయంగా ఉంది. ఈ వృద్ధికి అనుకూలంగా అప్డేటెడ్ డిజైన్‌ను మేము లాంచ్ చేశాం. హైక్‌పై సర్వీసులను తేలికగా గుర్తించి, లావాదేవీలు జరుపుకోవడానికి డిజైన్‌ను అప్డేట్ చేశాం. తమ యూజర్లకు మరిన్ని సర్వీసులు అందించాల్సి ఉంది. ఫ్లాట్‌ఫామ్‌పై ట్యాక్సీల బుకింగ్స్, మూవీ టిక్కెట్ల బుకింగ్ కోసం మేము ఎక్కువగా కృషిచేస్తున్నాం. వచ్చే క్వార్టర్ ప్రారంభంలోనే వీటిని ప్రారంభించనున్నాం'' అని హైక్ మెసెంజర్ సీఈవో, వ్యవస్థాపకుడు కవిన్ భారతి మిట్టల్ తెలిపారు. ఈ నెల మొదట్లో గ్రూప్‌లకు సోషల్ ఫీచర్లను యాడ్ చేసింది. దీనిలో తొలి ఫీచర్.. ఓటు. ఈ ఫీచర్ ద్వారా గ్రూప్ చాట్‌లో యూజర్ పోల్‌ను పెట్టవచ్చు. తర్వాత ఫీచర్ బిల్ స్ప్లిట్. దీని ద్వారా గ్రూప్‌లో స్నేహితులు తమ బిల్లులను షేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా హైక్ వాలెట్ ద్వారా మనీని పొందవచ్చు. -
హైక్ మెసెంజర్లో మరిన్ని ఫీచర్లు..
న్యూఢిల్లీ: మొబైల్ యాప్ ‘హైక్ మెసెంజర్’ తాజాగా తన గ్రూప్ చాట్‌కు ఆరు కొత్త ఫీచర్లను జోడించింది. ఓటింగ్, బిల్ స్లి్పట్, చెక్‌లిస్టులు, ఈవెంట్ రిమైండర్స్ వంటి పలు ప్రత్యేకతలను అనుసంధానించినట్లు తెలిపింది. విద్యార్థులు, యువత ప్రధాన లక్ష్యంగా ఈ ఫీచర్లను తీసుకువచ్చామని పేర్కొంది. ‘గ్రూప్‌లో ఈవెంట్/పార్టీ/సినిమాను ఎంపిక చేసుకోవటంపై చర్చ వస్తే.. ఓటింగ్ ద్వారా ఒక నిర్ణయానికి రావొచ్చు. స్నేహితులు బిల్లును స్లి్పట్ చేసుకోవచ్చు. తీన్ పత్తి ఆడుకోవచ్చు. దీనివల్ల వివిధ రకాల యాప్‌లను ఉపయోగించాల్సిన పని ఉండదు’ అని హైక్ మెసెంజర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ విశ్వనాథ్ రామారావు తెలిపారు. -
హైక్ నుంచి వీడియో కాల్స్: 2జీ ఉన్నా చాలు
న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ హైక్ మెస్సెంజర్ తన ఖాతాదారుల కోసం వీడియో కాలింగ్ ఫీచర్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. నెట్వర్క్ బాగుంటే 2జీలోనే అధిక నాణ్యతగల వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చని చెప్పింది. వీడియో కాలింగ్ సదుపాయాన్ని హైక్ బీటా వెర్షన్(ప్రయోగాత్మక సేవలు)తో సెప్టెంబరులోనే ప్రారంభించింది. ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి తెచ్చింది. -
హైక్ మెసెంజర్ యూజర్లు @: 10 కోట్లు
న్యూఢిల్లీ: దేశీ ప్రముఖ మొబైల్ మెసేజింగ్ యాప్ ‘హైక్ మెసెంజర్’ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య 10 కోట్ల మార్క్‌ను అధిగమించింది. గతేడాది ఆగస్ట్‌లో 2 వేల కోట్లగా ఉన్న నెలవారీ సందేశాల పరిమాణం ఇప్పుడు 4 వేల కోట్ల స్థాయికి పెరిగిందని కంపెనీ తెలిపింది. దీనర్థం యూజర్లు ఒక వారానికి 2 గంటలకు పైగా హైక్ యాప్‌ను ఉపయోగిస్తున్నారని పేర్కొంది. హైక్ మెసెంజర్లో సందేశాలు పంపించడం మాత్రమే కాకుండా వీడియో కాలింగ్ సౌలభ్యం, క్రికెట్ స్కోర్ వివరాలు తెలుసుకోవడం, ఆంగ్లం/హిందీ భాషల్లో వార్తలు చదువుకోవడం, ఫైల్ షేరింగ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. -
ఇక ఇంటర్నెట్ లేకుండానే హైక్ మెసెంజర్!
ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ అయిన హైక్ మెసెంజర్ వాడాలంటే ఫోన్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి కదూ.. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే దాన్ని వాడుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. తమకు దాదాపు 7 కోట్లమంది యూజర్లు ఉన్నారని, కానీ ఇప్పటికీ దేశంలో చాలామంది స్మార్ట్‌ఫోన్ వాడకందారులకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండట్లేదని, అందుకే తాము ఇంటర్నెట్ అవసరం లేకుండానే తమ యాప్ ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తున్నామని హైక్ మెసెంజర్ వ్యవస్థాపకుడు, సీఈవో కవిన్ భారతి మిట్టల్ తెలిపారు. వై-ఫై, మొబైల్ డేటా ఏవీ లేకుండానే ఫొటోలు, స్టిక్కర్లు, ఫైళ్లు, మెసేజిలను ఇతర హైక్ మెసెంజర్ వాడకం దారులకు పంపుకోవచ్చని ఆయన వివరించారు. 70 ఎంబీ పరిమాణంలో ఉండే పెద్ద ఫైళ్లను కూడా కేవలం 10 సెకండ్లలోనే పంపేయొచ్చన్నారు. ఏడాదికి దాదాపు నూరు శాతం చొప్పున వృద్ధిరేటు తమ యాప్‌కు ఉంటోందన్నారు. ప్రస్తుతం నెలకు 2వేల కోట్ల మెసేజిలు పంపుతున్నారని, వారానికి కనీసం 140 నిమిషాలు ఈ యాప్ మీద గడుపుతున్నారని చెప్పారు. ఇటీవలే వందమంది యూజర్లతో కాన్ఫరెన్స్ కాల్ చేసుకునే అవకాశాన్ని కూడా హైక్ మెసెంజర్ కల్పించిన విషయం తెలిసిందే. -
హైక్ నుంచి ఉచిత కాల్స్
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్, సాఫ్ట్‌బ్యాంక్ కార్పొరేషన్ల జాయింట్ వెంచర్, ప్రముఖ మొబైల్ చాట్ అప్లికేషన్, హైక్ మెసెంజర్ ఆంతర్జాతీయంగా ఉన్న తన వినియోగదారులకు ఉచిత కాల్స్‌ను అందించనుంది. ఈ సేవలు యూఎస్‌కు చెందిన జిప్ ఫోన్ అప్లికేషన్ ద్వారా ఒక నెలలోగా అందుబాటులోకి రానున్నాయి. వీటికి ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి.తొలిగా ఆండ్రాయిడ్ ఫోన్లలో తర్వాత విండోస్, ఓఎస్ మొబైళ్లలో కూడా ఈ సర్వీస్‌ను అందుబాటులోకి తెస్తామని హైక్ పేర్కొంది. ‘భారత మార్కెట్ చాలా ఖరీదైన, సున్నితమైంది. డాటా సర్వీసులల్లో మాకు బాగా అనుభవం ఉంది. మా కస్టమర్లు ఒక ఎంబీతో ఎక్కువ నిమిషాలు మాట్లాడుకోవచ్చు. దీనితోపాటు ఉచిత కాల్స్ సర్వీస్‌ను అంతర్జాతీయంగా అందుబాటులోకి తెస్తున్నాం’ అని హైక్ సీఈఓ కవిన్ మిట్టల్ చెప్పారు.