ఇక ఇంటర్నెట్ లేకుండానే హైక్ మెసెంజర్! | hike messenger adds feature to operate without internet | Sakshi
Sakshi News home page

ఇక ఇంటర్నెట్ లేకుండానే హైక్ మెసెంజర్!

Published Thu, Oct 8 2015 2:13 PM | Last Updated on Sun, Sep 3 2017 10:39 AM

ఇక ఇంటర్నెట్ లేకుండానే హైక్ మెసెంజర్!

ఇక ఇంటర్నెట్ లేకుండానే హైక్ మెసెంజర్!

ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ అయిన హైక్ మెసెంజర్ వాడాలంటే ఫోన్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి కదూ.. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే దాన్ని వాడుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. తమకు దాదాపు 7 కోట్లమంది యూజర్లు ఉన్నారని, కానీ ఇప్పటికీ దేశంలో చాలామంది స్మార్ట్ఫోన్ వాడకందారులకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండట్లేదని, అందుకే తాము ఇంటర్నెట్ అవసరం లేకుండానే తమ యాప్ ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తున్నామని హైక్ మెసెంజర్ వ్యవస్థాపకుడు, సీఈవో కవిన్ భారతి మిట్టల్ తెలిపారు. వై-ఫై, మొబైల్ డేటా ఏవీ లేకుండానే ఫొటోలు, స్టిక్కర్లు, ఫైళ్లు, మెసేజిలను ఇతర హైక్ మెసెంజర్ వాడకం దారులకు పంపుకోవచ్చని ఆయన వివరించారు.

70 ఎంబీ పరిమాణంలో ఉండే పెద్ద ఫైళ్లను కూడా కేవలం 10 సెకండ్లలోనే పంపేయొచ్చన్నారు. ఏడాదికి దాదాపు నూరు శాతం చొప్పున వృద్ధిరేటు తమ యాప్కు ఉంటోందన్నారు. ప్రస్తుతం నెలకు 2వేల కోట్ల మెసేజిలు పంపుతున్నారని, వారానికి కనీసం 140 నిమిషాలు ఈ యాప్ మీద గడుపుతున్నారని చెప్పారు. ఇటీవలే వందమంది యూజర్లతో కాన్ఫరెన్స్ కాల్ చేసుకునే అవకాశాన్ని కూడా హైక్ మెసెంజర్ కల్పించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement