ముంబై: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవంతో అన్నిరంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాను నియంత్రించేందుకు మెజారిటీ ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫ్షన్ (ఇంటి నుంచే సేవలందించడం) ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫ్టన్ ద్వారా తమకు ఖర్చుల భారం తగ్గినట్టు కొన్ని కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. కానీ, ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ద్వారా ఖర్చులు మరింతగా పెరిగాయని టాటా సన్స్ (టీసీఎస్) చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు.
ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం పెట్టుబడులను ఆకర్షిం,ఇ, ఖర్చులను తగ్గించే ప్రణాళికను టీసీఎస్ అవలంభిస్తుందని షేర్ హోల్డర్ల సమావేశంలో పేర్కొన్నారు. కరోనా వైరస్ ఉదృతి నేపథ్యంలో కీలక పెట్టుబడులను ఆకర్షించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా, చిన్న కంపెనీలను కొనుగోలు చేసే వ్యూహం తమ ప్రణాళికలో లేదని అన్నారు. కేవలం లాభాల కోసం సంస్థలను కొనుగోలు చేయమని తెలిపారు. టీసీఎస్ సీఈఓ రాజేష్ గోపినాథ్ స్సందిస్తూ.. 2016నుంచి 2020సంవత్సరం వరకు షేర్ హోల్డర్లకు అత్యధిక లాభాలు టీసీఎస్ బ్రాండ్‌తో సాధ్యమయిందని అన్నారు. (చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్‌కు సైబర్ బీమా!)
Comments
Please login to add a commentAdd a comment