రూ.5,000 కోట్ల వరకూ సమీకరణ!
న్యూఢిల్లీ: భారత క్యాపిటల్ మార్కెట్లో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)ల జోరు కొనసాగుతోంది. తాజాగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐపీఓకు రానున్నది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.5,000 కోట్ల సమీకరించనున్నదని అంచనా. ఐపీఓ సంబంధిత పత్రాలను సెబీకి సమర్పించే సన్నాహాల్లో ఉంది. ఈ ఐపీఓను బ్యాంక్ ఆప్ అమెరికా మెరిల్ లించ్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, డాషే బ్యాంక్, యూబీఎస్, సీఎల్‌ఎస్‌ఏలు నిర్వహించవచ్చు.