జుకర్బర్గ్ క్విట్ అయితే.. | If Mark Zuckerberg quits, he may lose majority voting control | Sakshi
Sakshi News home page

జుకర్బర్గ్ క్విట్ అయితే..

Published Sat, Jun 4 2016 12:12 PM | Last Updated on Mon, Sep 4 2017 1:40 AM

జుకర్బర్గ్ క్విట్ అయితే..

జుకర్బర్గ్ క్విట్ అయితే..

శాన్ఫ్రాన్సిస్కో: సామాజిక మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ యాజమాన్య బాధ్యతలు త్వరలోనే మారనున్నాయా? చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జుకర్ బర్గ్ పరిమిత అధికారాలతో ఫౌండర్ లెడ్ గా మిగిలనున్నారా? తాజాగా సంస్థ కదలికలను పరిశీలిస్తే ఇదే నిజమనిపిస్తోంది. ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో ఆయన బాధ్యతల నుంచి నిష్క్రమిస్తే  మెజారిటీ ఓటింగ్ పై నియంత్రణ కోల్పోతారని  ఫేస్బుక్ బోర్డ్ తెలిపింది. ఈ మేరకు ఈ నెలలో జరిగే కార్యక్రమంలో.. మార్క్ జకర్బర్గ్  మెజారిటీ ఓటింగ్ నియంత్రణ తొలగించటానికి  సంస్థ ప్రణాళిక రచించింది. దీనిపై  అమెరికా సెక్యూరిటీ అండ్ ఎక్సేంజ్  దగ్గర ఒక ప్రాక్సీని (ఓటింగ్ ద్వారా ఎన్నుకనే ప్రత్యామ్నాయ ప్రతినిధి) కూడా ఫైల్ చేసింది.  దీనిపై  వాటాదారుల అభిప్రాయాలను వోటింగ్ ద్వారా సేకరించనుంది. ఈ ప్రతిపాదన ప్రకారం జుకర్ బర్గ్  ఆధ్వర్యంలో క్లాస్ బి గా ఉన్న షేర్లు  క్లాస్ ఎ గా మారనున్నాయని పేర్కొంది.   షేర్ హోల్డర్ల  ఓటింగ్  ద్వారా దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.

జూన్  2 నాటికి 4 మిలియన్ల ఎ క్లాస్ షేర్లు, 419 మిలియన్ బి క్లాస్ షేర్లు జుకర్ బర్గ సొంతం. జూన్ 20న జరిగే   ఫేస్బుక్ వార్షిక సమావేశంలో నిర్వహించే ఓటింగ్ ద్వారా  జుకర్ బర్గ్ ముఖ్య అధికారాలపై నిర్ణయం జరిగనుంది. గత ఏప్రిల్ లోజుకర్ బర్గ్ చేసిన ప్రతిపాదన మేరకు  ఈ  నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ బోర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వోటింగ్ ద్వారా ఫేస్బుక్ వ్యవస్థాపక ఆధ్వర్యంలోని కంపెనీయో, వ్యవస్థాపక నియంత్రిత కంపెనీయో తెలిపోతుందని పేర్కొంది.  

కాగా ప్రస్తుత నిబంధనల ప్రకారం జకర్బర్గ్ బి  క్లాస్ షేర్లను,   మెజారిటీ ఓటింగ్ నియంత్రణ కలిగి ఉండటాన్ని అనుమతిస్తుంది. దీంతోపాటుగా జకర్ బర్గ్   మరణము తరువాత అతని వారసులకు కూడా దాదాపు ఇదే అధికారం ఉంది. మెజారిటీ ఓటింగ్ కంట్రోల్ ,  క్లాస్ బి షేర్ల పాస్ చేసే అనుమతి కూడా వారికి ఉంది.  అయితే  తమ అభిమాన సీఈవో జుకర్ బర్గ్  చీఫ్ యాజమాన్య అధికారాలను పరిమితం చేయడానికి   షేర్ హోల్డర్లు  అనుమతిస్తారా వేచి చూడాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement