ప్రపంచ ఆర్థిక రిస్క్ లు పెరిగాయ్
♦ ఐఎంఎఫ్ నివేదిక హెచ్చరిక
♦ సమగ్ర, పటిష్ట, సమన్వయ విధాన చర్యలకు సూచన
వాషింగ్టన్: ప్రపంచ ఆర్థిక రిస్క్‌లు పెరిగాయని, దీనిని ఎదుర్కొనడానికి అన్ని దేశాలూ సమన్వయంగా పటిష్ట విధాన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) పేర్కొంది. ఈ మేరకు తాజా ప్రపంచ ఫైనాన్షియల్ స్టెబిలిటీ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం...
♦ కమోడిటీ ధరల పతనం, చైనా మందగమనం వంటివి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.
♦ అనిశ్చితిని సమన్వయంతో ఎదుర్కొనలేకపోతే.. వర్థమాన దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. రానున్న ఐదేళ్లలో ఒక ఏడాదికి సమానమైన వృద్ధి హరించుకుపోయే ప్రమాదం ఉంది.
♦ అయితే సమన్వయంగా పరిస్థితిని ఎదుర్కొనగలిగితే... 2% అదనపు వృద్ధీ సాధ్యమవుతుంది.
♦ ఈక్విటీల్లో తీవ్ర ఒడిదుడుకులకు విశ్వాసం పటిష్టంగా లేకపోవడమే ఒక కారణం.
♦ వృద్ధి విషయంలో ద్రవ్య పరమైన విధానాలకు కీలకం అయినప్పటికీ, కేవలం వీటిద్వారానే సమస్య పరిష్కారం అయిపోతుందని భావించరాదు. వృద్ధికి దోహదపడే పటిష్ట సంస్కరణలు, తగిన సమన్వయ ద్రవ్య విధానాలు అవసరం. ఆయా అంశాల వల్ల ప్రతికూలతలను తట్టుకుని నిలబడేలా చేస్తుంది.
♦ అంతర్జాతీయ స్థాయిలో ఫైనాన్షియల్ రెగ్యులేటరీ సంస్కరణల ఎజెండా పూర్తికావాలి.
♦ కమోడిటీ ధరల తగ్గుదల, పలు దేశాల్లో ద్రవ్యపరమైన ఇబ్బందులు ప్రపంచ వృద్ధి అంచనాలను బలహీనంగా మార్చుతున్నాయి.