IMF report
-
IMF Report: ఆ టెక్నాలజీతో సగానికిపైగా ఉద్యోగాలు పోతాయ్..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని వ్యవస్థల్లోని ఉద్యోగాలకు ముప్పుగా పరిణమించింది. దీని ప్రభావం ఇప్పటికే ప్రారంభం కాగా రానున్న రోజుల్లో మరింత తీవ్ర రూపం దాల్చనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతకు ముప్పును కలిగిస్తుందని, అయితే ఉత్పాదకత స్థాయిలను పెంచడానికి, ప్రపంచ వృద్ధికి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) చీఫ్ చెబుతున్నారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో 60 శాతం ఉద్యోగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా.. దావోస్ డబ్ల్యూఈఎఫ్ సదస్సు బయలుదేరే కొద్దిసేపటి ముందు వాషింగ్టన్లో ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఏఐ ప్రభావం తక్కువగా ఉంటుందన్న అంచనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఐఎంఎఫ్ తాజా నివేదికను ఉటంకిస్తూ పేర్కొన్నారు. సగం మంది పోయినా మిగిలినవారికి లబ్ధి ఎంత ఎక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం అంత ఎక్కువగా ఉంటుందన్నారు. ఏఐ వల్ల ఉద్యోగం పూర్తిగా పోవచ్చు లేదా మెరుగుపడవచ్చని, ఉత్పాదకత, ఆదాయ స్థాయి పెరగవచ్చని జార్జివా చెప్పారు. కాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సగం ఉద్యోగాలు పోయినప్పటికీ మిగిలిన సగం మంది ఏఐ కారణంగా మెరుగైన ఉత్పాదకత ప్రయోజనం పొందుతారని ఐఎంఎఫ్ తాజా నివేదిక పేర్కొంది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కార్మిక వ్యవస్థపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్దగా ఉండదని, అదే సమయంలో దాని ద్వారా ఉత్పన్నమయ్యే మెరుగైన ఉత్పాదకత నుంచి ప్రయోజనం పొందే అవకాశం కూడా తక్కువగానే ఉంటుందని వివరించింది. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందించే అవకాశాలను అందుకోవడానికి పేద దేశాలకు సహాయం చేయడంపై దృష్టి పెట్టాల్సిఉందని జార్జివా ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో పేర్కొన్నారు. -
భారత్ వృద్ధి 6.8 శాతం
వాషింగ్టన్: భారత్ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) 6.8 శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది. 2023–24లో ఈ రేటు 6.1 శాతానికి తగ్గుతుందని విశ్లేషించింది. అంతర్జాతీయ తీవ్ర క్లిష్ట పరిస్థితుల్లో భారత్ నెట్టుకు వస్తోందని వర్చువల్‌గా జరిగిన విలేకరుల సమావేశంలో ఐఎంఎఫ్ ఇండియా మిషన్ చీఫ్ చౌయిరీ నాడా పేర్కొన్నారు. అంతక్రితం ఆమె భారత్ అధికారులతో జరిగిన వార్షిక సంప్రదింపులకు సంబంధించి ఒక నివేదికను విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం, భారత్ వృద్ధి ఒక మోస్తరుగా కొనసాగుతుంది. అవుట్‌లుక్ ‘పేవరబుల్’కన్నా దిగువస్థాయిలోనే ఉంటుంది. కఠిన ఆర్థిక పరిస్థితులు కొంత ఇబ్బందిని కల్పిస్తాయి. అయితే క్రితం అంచనాలకన్నా ప్రస్తుత పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. ‘వాస్తవానికి, మా అంచనాల్లో ఈ సంవత్సరం– తదుపరి సంవత్సరం ప్రపంచ వృద్ధికి భారతదేశం అరశాతంమేర భాగస్వామ్యాన్ని కలిగిఉంటుంది’’ అని ఆమె చెప్పారు. ప్రపంచ ఆర్థిక మందగమన పరిస్థితుల ప్రభావం అటు వాణిజ్య పరంగా ఇటు ఫైనాన్షియల్ రంగం పరంగా భారత్‌పై ఉంటాయని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా దేశం ద్రవ్యోల్బణం సవాళ్లపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత్‌తో విస్తృత స్థాయి సంస్కరణలు –వాటి అమలు ఊహించినదానికన్నా వేగంగా ఉందన్నారు. అలాగే దేశంలో విస్తరిస్తున్న డిజిటలైజేషన్ ప్రయోజనాలను భారత్ భారీగా పొందనుందని వివరించారు. వృద్ధిలో బలహీనతలు ఉన్నాయ్: జయంత్ వర్మ ఇదిలాఉండగా, భారత్ ఎకానమీ వృద్ధి ధోరణి చాలా బలహీనంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యుడు జయంత్ ఆర్ వర్మ పేర్కొన్నారు. వృద్ధి పటిష్టతకు నాలుగు అంశాల్లో బలపడాల్సి ఉందని పేర్కొంటూ... ఎగుమతులు, ప్రభుత్వ వ్యయాలు, మూలధన పెట్టుబడులు, ప్రైవేటు వినియోగం పెంపుపై తక్షణ దృష్టి అవసరమని పేర్కొన్నారు. 2022–23లో భారత్ వృద్ధి రేటును ఆర్బీఐ 6.8 శాతంగా అంచనావేస్తుండగా, ప్రపంచ బ్యాంక్ విషయంలో ఈ రేటు 6.9 శాతంగా ఉంది. -
ఆర్థిక వ్యవస్ధను అలా వదిలేయకండి..
వాషింగ్టన్ : ప్రపంచ ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే భారత ఆర్థిక వ్యవస్థను స్లోడౌన్ సెగల నుంచి తప్పించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఐఎంఎఫ్ భారత్‌ను కోరింది. వినియోగం, పెట్టుబడులు మందగించడం, పన్ను రాబడి పడిపోవడం వంటి సమస్యలతో దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎకానమీకి అవరోధంగా నిలిచాయని ఐఎంఎఫ్ తన వార్షిక సమీక్షలో పేర్కొంది. లక్షలాది మందిని పేదరికం నుంచి బయటపడవేసిన అనంతరం భారత్ ఇప్పుడు ఆర్థిక మందగమనం గుప్పిట్లో కూరుకుపోయిందని ఐఎంఎఫ్ ఆసియా పసిఫిక్ విభాగానికి చెందిన రణిల్ సల్గాదో వ్యాఖ్యానించారు. ప్రస్తుత మందగమనాన్ని అధిగమించి తిరిగి వృద్ధి పధంలో పయనించేందుకు భారత్ తక్షణ విధాన నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. అయితే ఇప్పటికే అధిక రుణాలు, వడ్డీ చెల్లింపులతో సతమతమవుతున్న భారత్ వృద్ధిని గాడిలో పెట్టేందుకు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టే స్థితిలో ప్రభుత్వం లేదని హెచ్చరించింది. చదవండి : నిర్మాణాత్మక సంస్కరణలపై దృష్టి పెట్టాలి -
ఆ దేశాల మందగమనానికి నిరుద్యోగమే కారణం
దుబాయ్: అరబ్ దేశాల ఆర్ధిక పరిస్థితికి సంబంధించి ఐఎమ్ఎఫ్ ఓ నివేదిక విడుదల చేసింది. ఈ క్రమంలో అరబ్ దేశాల ఆర్థిక వృద్ధి మందగమనానికి నిరుద్యోగం, సామాజిక ఉద్రిక్తతలు ఆజ్యం పోస్తున్నాయని ఐఎమ్ఎఫ్ సోమవారం తెలిపింది. నివేదిక ప్రకారం ఉత్తర ఆఫ్రికా (మెనా) నెమ్మదిగా వృద్ధి చెందడానికి అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, చమురు ధరల అస్థిరత, బ్రెక్సిట్ ప్రక్రియ ఆలస్యం కావడం ప్రధాన కారణాలని వెల్లడించింది. సౌదీ అరేబియా, ఇరాన్ యూఏఈ లాంటి మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల వృద్ధి రేటు తగ్గిందని నివేదిక స్పష్టం చేసింది. కాగా, ఐఎమ్ఎఫ్ డైరెక్టర్ జిహాద్ అజహర్ మాట్లాడుతూ మద్య ఆసియాలో వృద్ధి రేటు తగ్గడానికి నిరుద్యోగమే ప్రధాన కారణమని చెప్పారు. నిరుద్యోగం కారణంగానే సామాజిక ఉద్రిక్తతలు నెలకొన్నాయని నివేదిక స్పష్టం చేసింది. ఈ ప్రాంతలలో నిరుద్యోగం సగటున 11 శాతం కొనసాగుతుండగా ఇతర అభివృద్ధి ఆర్థిక వ్యవస్థలలో 7 శాతం అని తెలిపింది. 18శాతంగా ఉన్న మహిళలు, యువత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో తోడ్పాటును అందించడం లేదని తెలిపింది. అరబ్ దేశాల రుణ భారం గణనీయమైన స్థాయిలో పెరగగా, ఈ ప్రభావం పెట్టుబడులను ఆకర్షించడంలో అడ్డంకులు సృష్టించవచ్చని పేర్కొంది. ఇరాన్ పై అమెరికా ఆంక్షల కారణంగా తీవ్ర ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొంటుందని తెలిపింది. ఈ దేశాల ఆర్ధిక వ్యవస్థల బలోపేతానికి చమురు నిల్వలతో పాటు వేగవంతమైన సంస్కరణలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మరోవైపు సౌదీ అరేబియా నేతృత్వంలోని అరబ్ దేశాల వృద్ధి రేటు 2018లో 2శాతం ఉండగా ప్రస్తుత సంవత్సరం ఆయిల్ ధరల తగ్గడం వలన కేవలం 0.7శాతం నమోదవుతుందని తెలిపింది. -
‘ఆర్బీఐకి మరిన్ని అధికారాలు’
వాషింగ్టన్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) స్వతంత్రంగా వ్యవహరించేలా భారత్ పటిష్ట చర్యలు చేపట్టాలని ఐఎంఎఫ్ కోరింది. బ్యాంకుల పనితీరును చురుకుగా పర్యవేక్షించేందుకు, ప్రభుత్వం నియమించిన బ్యాంకు డైరెక్టర్ల తొలగింపు వంటి అంశాల్లో ఆర్బీఐకి పూర్తి అధికారాలుండాలని ఐఎంఎఫ్ నివేదిక స్పష్టం చేసింది. రాజకీయ ప్రాబల్యం కలిగిన వ్యక్తుల నుంచి ఎదురయ్యే రిస్క్‌ల పరిష్కారం, కమాడిటీ మార్కెట్ల ఏకీకృత పర్యవేక్షణ అవసరమని అభిప్రాయపడింది. ఐఎంఎఫ్ తన ఫైనాన్షియల్ సిస్టమ్ స్టెబిలిటీ అసెస్మెంట్లో ఈ అంశాలు పొందుపరిచింది. ఆర్బీఐ స్వతంత్రంగా వ్యవహరించాలని పేర్కొనడంతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఆర్బీఐకి విస్తృతాధికారాలు ఉండాలని పేర్కొంది. ఆర్బీఐ నిర్ణయాలను ప్రభుత్వం అధిగమించడాన్ని చట్టంలో సవరణల ద్వారా అడ్డుకట్ట వేయాలని సూచించింది. ఇక కీలక వ్యవస్ధాగత సంస్కరణల ఊతంతో భారత్ ఆర్థిక, ఫైనాన్షియల్ ఆస్తుల పరంగా మంచి వృద్ధి కనబరుస్తోందని పేర్కొంది. -
ప్రపంచ ఆర్థిక రిస్క్ లు పెరిగాయ్
♦ ఐఎంఎఫ్ నివేదిక హెచ్చరిక ♦ సమగ్ర, పటిష్ట, సమన్వయ విధాన చర్యలకు సూచన వాషింగ్టన్: ప్రపంచ ఆర్థిక రిస్క్‌లు పెరిగాయని, దీనిని ఎదుర్కొనడానికి అన్ని దేశాలూ సమన్వయంగా పటిష్ట విధాన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) పేర్కొంది. ఈ మేరకు తాజా ప్రపంచ ఫైనాన్షియల్ స్టెబిలిటీ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం... ♦ కమోడిటీ ధరల పతనం, చైనా మందగమనం వంటివి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ♦ అనిశ్చితిని సమన్వయంతో ఎదుర్కొనలేకపోతే.. వర్థమాన దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. రానున్న ఐదేళ్లలో ఒక ఏడాదికి సమానమైన వృద్ధి హరించుకుపోయే ప్రమాదం ఉంది. ♦ అయితే సమన్వయంగా పరిస్థితిని ఎదుర్కొనగలిగితే... 2% అదనపు వృద్ధీ సాధ్యమవుతుంది. ♦ ఈక్విటీల్లో తీవ్ర ఒడిదుడుకులకు విశ్వాసం పటిష్టంగా లేకపోవడమే ఒక కారణం. ♦ వృద్ధి విషయంలో ద్రవ్య పరమైన విధానాలకు కీలకం అయినప్పటికీ, కేవలం వీటిద్వారానే సమస్య పరిష్కారం అయిపోతుందని భావించరాదు. వృద్ధికి దోహదపడే పటిష్ట సంస్కరణలు, తగిన సమన్వయ ద్రవ్య విధానాలు అవసరం. ఆయా అంశాల వల్ల ప్రతికూలతలను తట్టుకుని నిలబడేలా చేస్తుంది. ♦ అంతర్జాతీయ స్థాయిలో ఫైనాన్షియల్ రెగ్యులేటరీ సంస్కరణల ఎజెండా పూర్తికావాలి. ♦ కమోడిటీ ధరల తగ్గుదల, పలు దేశాల్లో ద్రవ్యపరమైన ఇబ్బందులు ప్రపంచ వృద్ధి అంచనాలను బలహీనంగా మార్చుతున్నాయి. -
ఈ ఏడాది భారత వృద్ధి 7.5%
ఐఎంఎఫ్ తాజా నివేదిక వాషింగ్టన్: భారత్ జీడీపీ ఈ ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతానికి చేరుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) పేర్కొంది. ఈ ఏడాది చైనా జీడీపీ కన్నా భారత జీడీపీ 1 శాతం అధికంగా ఉంటుందని తన తాజా వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ నివేదికలో ఐఎంఎఫ్ తెలిపింది. ప్రైవేట్ వినియోగం జోరుగా ఉండడం, పారిశ్రామిక కార్యకలాపాలు పెరగడం దీనికి ప్రధాన కారణాలని వివరించింది. గత ఏడాది అక్టోబర్ అంచనాలనే ఐఎంఎఫ్ కొనసాగించింది. భారత్‌లో ద్రవ్య పరిస్థితులు స్థిరంగానే ఉన్నాయని, 5 శాతం కంటే దిగువగానే ద్రవ్యోల్బణం ఉందని పేర్కొంది. అయితే ప్రతికూలమైన వర్షపాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరగడం...ప్రతికూల ప్రభావం చూపుతాయని వివరించింది.